AIG Hospitalలో బాలయ్య.. ఈ రాత్రే సర్జరీ జరిగే అవకాశం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AIG Hospital: నందమూరి బాలకృష్ణ ఆరోగ్యానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. బాలకృష్ణ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న AIG ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆయనకు ఈ రాత్రి లేదా రేపు ఉదయం వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. వైద్యుల సూచన మేరకు ఈ శస్త్రచికిత్స అనంతరం బాలకృష్ణ దాదాపు నెలన్నర రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ప్రస్తుతం కమిట్ అయిన సినిమా షూటింగ్‌లు, ఇతర కార్యక్రమాల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కాకినాడ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా NBK111 షూటింగ్లో ఒక భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేస్తుండగా ఆయన మోకాలుకి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే బాలకృష్ణను చిత్ర బృందం కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక ట్రీట్మెంట్ అందించారు. అక్కడి వైద్యులు ఆయన మోకాలుకి ఎక్స్-రే, స్కాన్ చేసి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం బాలకృష్ణ ఈ రోజు ఉదయం కాకినాడ నుంచి బయలుదేరి రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. ప్రస్తుతం ఆయన AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలియడంతో ఆయన అభిమానులు బాలయ్య త్వరగా కోలుకుని మళ్లీ పూర్తి ఆరోగ్యంతో బయటికి రావాలని ఆకాంక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన అభిమానులు “Get Well Soon NBK” అంటూ పెద్ద ఎత్తున పోస్ట్‌లు పెడుతున్నారు.
Also Read
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!