తమిళ సినిమా చరిత్రలో AVM స్టూడియోస్ కు ప్రతీక గుర్తింపు ఉంది. AVM ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అంతటి పేరు ప్రఖ్యాతలు కలిగిన ఏవిఎమ్ ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరైన ప్రముఖ సినీ నిర్మాత M. శరవణన్ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. 86 సంవత్సరాల వయసులో వయోభారం కారణంగా చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు ఒక శకానికి ముగింపు పలికానట్టయింది.
Also Read : Tollywood : హిట్ దర్శకులను రిపీట్ చేస్తున్న టాలీవుడ్ హీరోలు
నిన్న తన పుట్టినరోజును జరుపుకున్న AVM శరవణన్, తమిళ్ తో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో అనేక చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఏవీఎం బ్యానర్‌పై దాదాపు 300 సినిమాలను నిర్మించారు. తెలుగులో లీడర్ సినిమాతో దగ్గుబాటి రాణాను హీరోగా పరిచయం చేశారు శరవణన్. ఆయన భౌతికకాయాన్ని మధ్యాహ్నం 3:30 గంటల వరకు AVM స్టూడియోస్, 3వ అంతస్తులో నివాళులర్పించేందుకు ఉంచుతారు. తమిళ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉండే ఒక దార్శనికుడు, గురువు మరియు మార్గదర్శకుడిని కోల్పోవడం పట్ల కోలీవుడ్ సినీ ప్రపంచం సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు.