Ashu Reddy: 9.5 కోట్ల చీటింగ్ కేసు.. మీడియా ముందుకు అషు రెడ్డి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న ఉదయం బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి చుట్టూ ముసురుకున్న చీటింగ్ కేసు వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. నిన్న కేవలం తన మీద వస్తున్న ఆరోపణలను ప్రచారం చేస్తున్న వారి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అంశం మీద మౌనంగా ఉన్న అషు రెడ్డి, ఇప్పుడు ఈ ఆరోపణలపై గట్టిగా బదులిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి తాజా పరిణామాలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నిన్నంతా అషు రెడ్డి అడ్రస్ లేరంటూ ప్రచారం సాగినప్పటికీ, ఆమె మాత్రం నిన్నంతా ఆధ్యాత్మిక పర్యటనలో గడిపారు అని ఆమె సోషల్ మీడియా అకౌంట్లు చూస్తే క్లారిటీ వచ్చింది.
వరుసగా పలు దేవాలయాలను సందర్శించిన ఆమె, నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. మరోవైపు, ఈ వివాదం ముదురుతుండటంతో ఆమె తండ్రి కూడా వైజాగ్ నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు, చట్టపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై తండ్రీకూతుళ్లిద్దరూ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈరోజు అషు రెడ్డి తన తండ్రితో కలిసి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, అసలు ఏం జరిగింది? తనపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? అనే విషయాలపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ కేసులో ప్రధానంగా భారీ మొత్తంలో ఆన్‌లైన్ నగదు బదిలీ జరిగిన క్రమంలో పోలీసుల దర్యాప్తు ఇప్పుడు అషు రెడ్డికి ఇబ్బందికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read
- Jailer 2 First Single: రజనీకాంత్ 'జైలర్ 2' ఫస్ట్ సింగిల్ అవుట్.. ‘అలా బొలేలో’తో అనిరుధ్ మ్యాజిక్.. పాటలో పూర్ణే హైలైట్!
- Brahmastra 2: ‘రామాయణం’ తర్వాత రణబీర్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?.. ద్విపాత్రాభినయంతో సిద్ధమవుతున్నాడా?
- Venkatesh VP : "కింగ్డమ్" ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా తెలుగు సినిమా
- Shavukaru Janaki : వెండితెర 'షావుకారు' జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
తాజావార్తలు
-
CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
-
BMW X1 LWB: భారత్‌లో BMW X1 LWB విడుదల.. మొదటిసారి లగ్జరీ కారు కొనేవారిపై BMW కన్ను
-
Jailer 2 First Single: రజనీకాంత్ ‘జైలర్ 2’ ఫస్ట్ సింగిల్ అవుట్.. ‘అలా బొలేలో’తో అనిరుధ్ మ్యాజిక్.. పాటలో పూర్ణే హైలైట్!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Telangana Ration: రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా..? వారికి భారీ హెచ్చరిక..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?