బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సినీ రంగ ప్రవేశం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తండ్రి లాగా హీరోగా ఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ – హీరోగా కాకుండా డైరెక్టర్‌గా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించి బాలీవుడ్‌లో పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. కాగా ఆర్యన్ ఖాన్ తొలి దర్శకత్వ ప్రాజెక్ట్ పేరు ‘ The Ba***ds of Bollywood’. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే బాలీవుడ్ అంతటా భారీ బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ఆర్యన్ డైరెక్షన్‌లో వచ్చే ఈ సిరీస్‌పై షారుఖ్ ఖాన్ అభిమానుల్లోనూ, సాధారణ ఆడియెన్స్‌లోనూ కుతూహలం పెరిగింది.
Also Read : Anupama : సెట్‌లో హీరోలకు ఇచ్చినంత ఇంపార్టెన్స్.. హీరోయిన్‌లకు ఇవ్వరు
ఈ ప్రాజెక్ట్‌లో ‘కిల్’ సినిమాతో మంచి హిట్ సాధించిన లక్ష్య హీరోగా నటిస్తున్నాడు. అంతేకాకుండా షారుఖ్ ఖాన్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారన్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఆగస్టు 20న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌కి సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఆర్యన్ ఇంట్రడక్షన్‌తో స్టార్ట్ అయిన టీజర్ ఆసక్తికరమైన సన్నివేశాలతో నడుస్తూ, ఆడియెన్స్‌లో సిరీస్‌పై మరింత ఆసక్తి పెంచింది. ఈ సిరీస్‌ని నెట్‌ఫ్లిక్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గతంలో షారుఖ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ క్రియేటివ్ కంటెంట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. అదే తరహాలో ఆర్యన్ తొలి దర్శకత్వం సిరీస్ కూడా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందని అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు షారుఖ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న డెబ్యూ.. ఇప్పుడు డైరెక్టర్ రూపంలో రాబోతుండటంతో బిగ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి.