APFTDC : నంది అవార్డుల నిర్వహణపై ఏపీ ఫిలిం కార్పొరేషన్ కీలక అడుగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటక రంగాల సమగ్రాభివృద్ధికి నూతన పాలకవర్గం నడుం బిగించింది. ఏపీ ఫిలిం, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ (APFTDC) నూతన పాలకవర్గం యొక్క తొలి బోర్డు సమావేశం విజయవాడలోని ఫార్చూన్ మురళి పార్క్ హోటల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్. విశ్వనాథన్ ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించారు.
ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పి. భరత్ భూషణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమ పురోగతికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ తొలి సమావేశంలో ప్రధానంగా గతంలో ప్రకటించిన నంది అవార్డులతో పాటు, భవిష్యత్తులో నిర్వహించాల్సిన నంది అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన వివిధ అంశాలు, విధివిధానాలు మరియు సూచనలపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. దీంతో పాటు రాష్ట్రంలో సినిమా షూటింగులకు అనుకూల వాతావరణం కల్పించడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక వసతులు మరియు ప్రోత్సాహకాలు అందించడంపై ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను (రూట్ మ్యాప్) సిద్ధం చేయనున్నారు. ఏపీలో చిత్ర పరిశ్రమను మరింత బలోపేతం చేస్తూ.. కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలకు అండగా నిలిచేలా కార్పొరేషన్ అడుగులు పడబోతున్నట్లు బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు.
Also Read
- Shah Rukh Khan: ‘కింగ్’ నిర్మాతలపై కాసుల వర్షం.. మ్యూజిక్ రైట్స్‌తోనే సరికొత్త చరిత్ర!
- Lenin OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న100 కోట్ల బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'లెనిన్'
- Varun Tej: జై జై బాబు.. కళ్యాణ్ బాబు అంటూ మార్మోగిన ఈవెంట్.. పవన్ కళ్యాణ్‌పై వరుణ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్!
- Mega158: బర్త్‌డే స్పెషల్‌గా 'మెగా158' బీహైండ్ ది సీన్స్ వీడియో.. బాబీ కొల్లి విజన్‌పై మెగా టీమ్ ప్రశంసలు
ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ సీనియర్ నటుడు సుమన్ తల్వార్, ఎస్. శివాజీ, ప్రముఖ రచయిత బుర్రా సాయి మాధవ్, నిర్మాత వివేక్ కూచిభొట్ల, దర్శకుడు వి. సముద్రతో పాటు వై. ఝాన్సీ, చదలవాడ శ్రీనివాసరావు, కందిమళ్ల సాంబశివరావు, కే. ఉమామహేశ్వరరావు, ఎస్. వెంకట కృష్ణా రెడ్డి, జి. రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి. సత్యనారాయణ, దుర్గా ప్రసాద్ సాహు లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంస్థ జనరల్ మేనేజర్ ముడావత్ శ్రీనివాస్ నాయక్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
-
Secret Soldier : టైటిల్ మారింది.. ‘సీక్రెట్ సోల్జర్’గా వస్తున్న ‘చైనా పీస్’!
-
GST Collections July 2026: దేశ ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్.. జూలైలో GST వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
-
Toyota Fortuner: పెట్రోల్, డీజిల్‌కు గుడ్ బై.. 100% ఇథనాల్‌తో నడిచే కొత్త టొయోటా ఫార్చ్యూనర్ వచ్చేసిందోచ్..!
-
Shah Rukh Khan: ‘కింగ్’ నిర్మాతలపై కాసుల వర్షం.. మ్యూజిక్ రైట్స్‌తోనే సరికొత్త చరిత్ర!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!