ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌తో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు 14 మంది సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీ గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో నిర్మాతలు మంత్రి కందుల దుర్గేష్‌కు పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న సమస్యలు, సవాళ్లు మరియు తాజా పరిణామాల గురించి వివరించారు. ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మె, కార్మికుల వేతనాల సమస్యలు, షూటింగ్‌ల నిలిచిపోవడం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అలాగే, రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన కొత్త విధానాలు, స్టూడియోల నిర్మాణం, టికెట్ ధరల నియంత్రణ వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
Also Read : Tollywood: మీడియా ముందుకు వర్ధమాన నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?
సమావేశంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాతలలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, డి.వి.వి. దానయ్య, కె.ఎల్. నారాయణ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్, నాగ వంశీ, యెర్నేని రవిశంకర్, విశ్వ ప్రసాద్, బన్నీ వాసు, యూవీ క్రియేషన్స్ వంశీ, మైత్రీ మూవీ మేకర్స్ చెర్రీ, వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి ఉన్నారు. ఈ బృందం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏపీ సచివాలయానికి వెళ్లారు. ఈ భేటీ నేపథ్యంలో, గత కొన్ని రోజులుగా కార్మికుల 30 శాతం వేతన పెంపు డిమాండ్‌తో టాలీవుడ్‌లో నెలకొన్న బంద్ వాతావరణం కీలక అంశంగా మారింది. అయితే ఈ భేటీ అనంతరం నిర్మాత విశ్వప్రసాద్ మీడియాతో మాట్లాడారు మీడియాతో మాట్లాడుతూ అసలు మంత్రితో భేటీలో కార్మికుల సమస్య గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదని వెల్లడించారు. కేవలం సినీ పరిశ్రమ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి మాత్రమే చర్చ జరిగిందని ఆయన వెల్లడించారు. మరో నిర్మాత మైత్రీ రవిశంకర్ మాట్లాడుతూ ఏపీ సీఎం అపాయింట్మెంట్ కోసమే అడిగేందుకు వచ్చామని అన్నారు. ఎప్పుడో కలవాల్సి ఉందని , ఆలస్యం అవుతూ ఉండడంతో కలిసేందుకు వచ్చామని అన్నారు.