ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌తో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు 14 మంది సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీ గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో నిర్మాతలు మంత్రి కందుల దుర్గేష్‌కు పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న సమస్యలు, సవాళ్లు మరియు తాజా పరిణామాల గురించి వివరించారు. ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మె, కార్మికుల…