ఆహాలో హారర్ వెబ్ సీరిస్ ‘అన్యాస్ ట్యూటోరియల్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో ‘మెయిల్, లెవన్త్ అవర్, కుడిఎడమైతే’ వంటి వెబ్ ఒరిజినల్స్ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘అన్యాస్ ట్యూటోరియల్’ అనే సరికొత్త వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది ఆహా`. ఇందులో రెజీనా కసండ్ర, నివేదా సతీశ్, అగస్త్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పల్లవి గంగిరెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను ‘బాహుబలి’ వంటి సెన్సేషనల్ మూవీని నిర్మించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఆర్కా మీడియా బ్యానర్‌లో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.
అన్య అనే పాత్ర చుట్టూ తిరిగే కథతో రూపొందిన సిరీస్ ‘అన్యాస్ ట్యూటోరియల్’. అన్య ఓ పాపులర్ వెబ్ చానెల్‌ను నడుపుతుంటుంది. ఆమె ఇంట్లో ఆత్మలకు సంబంధించిన కార్యక్రమాలు జరిగినప్పుడు ఆమె జీవితం తలకిందులవుతుంది. ఆమె దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుందా లేక తగిన మూల్యం చెల్లించిందా? అనేదే ఇందులోని ప్రధానాంశం. ఇటీవలే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది.
Also Read
ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ, ”ఇప్పటి వరకు ఆహా యాప్‌ను కోటి మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని సరికొత్త పాత్ బ్రేకింగ్ కంటెంట్ ను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం” అని అన్నారు. దర్శకురాలు పల్లవి గంగిరెడ్డి మాట్లాడుతూ ”ఈ వెబ్ సీరిస్ కథపై నేను, సౌమ్యా శర్మ వర్క్ చేశాం. ఈ ఆలోచనను అల్లు అరవింద్‌గారు, శోభు యార్లగడ్డగారికి చెప్పినప్పుడు వారికి నచ్చడంతో మా ఆలోచన కార్యరూపం దాల్చింది. త్వరలోనే ఈ కథను ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాం” అని తెలిపింది.
రెజీనా కసండ్ర మాట్లాడుతూ ”నేను పద్నాలుగేళ్ల వయసున్నప్పుడు ‘కండ నాల్ ముదల్’ అనే సినిమాలో నటించాను. ఆ సినిమాను ప్రియా అనే మహిళా దర్శకురాలు తెరకెక్కించారు. ఇప్పుడు తెలుగులో నేను చేస్తున్న వెబ్ సిరీస్ దర్శకురాలు, రైటర్ ఇద్దరూ మహిళలే కావడం యాదృచ్చికమే అయినా ఎంతో సంతోషాన్నిస్తోంది. ఆర్కామీడియా సంస్థలో పనిచేయడం ఆనందంగా ఉంది. ‘అన్యాస్ ట్యూటోరియల్’ అనే కథ విన్నప్పుడు నేనెలా థ్రిల్ అయ్యానో అలాగే ప్రేక్షకులు కూడా అవుతారని భావిస్తున్నాను” అని అన్నారు.
శోభు యార్లగడ్డ మాట్లాడుతూ ‘మన తెలుగు ఇండస్ట్రీ మీద అల్లు అరవింద్‌గారు ఎంత పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంటారు. ఆయన ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయి. ఆహా తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో టాప్‌గా, లాండ్ మార్క్‌గా మారింది. ఆహా ద్వారా ఎంతో మంది కొత్త తరం దర్శకులు, టెక్నీషియన్స్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. సరికొత్త కంటెంట్‌ను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా కష్టమైన విషయం. ఆహాతో అరవింద్‌గారు దాన్ని సుసాధ్యం చేస్తున్నారు. ఏదో ఒకరోజు నేను, అరవింద్‌గారు కలిసి ‘బాహుబలి’ రేంజ్ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తాం’ అన్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ వెబ్ సీరిస్ షూటింగ్ అక్టోబర్ తో పూర్తవుతుంది. ఆపైన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిపి, ఏడు ఎపిసోడ్స్ గా దీనిని ఈ యేడాది క్రిస్మస్ వారాంతంలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!