బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సెన్సార్ బోర్డు (CBFC) తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల మలయాళ చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ విషయంలో సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని విమర్శిస్తూ.. ‘పాత్రలకు పురాణాల పేర్లు పెట్టొద్దన్న ఆంక్షలు విచిత్రంగా ఉన్నాయి’ అన్నారు. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ‘జానకి’ అనే పేరుపై సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పినందుకు అనురాగ్ తీవ్రంగా స్పందించారు. పాత్రలు XYZ, 123 లా మారాలా? అని ప్రశ్నిస్తూ, సెన్సార్ నియమాల వల్ల సినిమాలు నిలిచిపోతున్నాయని ఆవేదన తెలిపారు.
Also Read : Priyanka Mohan : గ్లామర్ షోకు తెరలేపిన ప్రియాంక మోహన్..
అలాగే, సెన్సార్ బోర్డులో భాషా అవగాహన లోపాలను కూడా ఎత్తిచూపారు. సెన్సార్ బోర్డులో ఉన్న భాషా అడ్డంకులను కూడా అనురాగ్ కశ్యప్ ఎత్తి చూపారు. ‘బోర్డులో ఉన్న చాలా మంది అధికారులకు హిందీ అర్థం కాదు. దీనికి ఉదాహరణ నా మొదటి చిత్రం ‘సత్య’. ఈ సినిమాలో ఒక పదానికి బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే డిక్షనరీ ప్రకారం ఆ పదానికి అర్థం “తెలివితక్కువ” లేదా “బెవాకూఫ్” అని వస్తుంది. దీనికే మరే అర్థం లేదు.. కానీ సెన్సార్ బోర్డు మహారాష్ట్రలో ఉండడం, అక్కడ కూర్చున్నవారు హిందీ మాట్లాడేవారు కాకపోవడం వల్ల, ఆ పదం ఉచ్చారణ, ధ్వని ఆధారంగా వారు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. దీంతో నేను వారికి డిక్షనరీ తీసుకువెళ్లి చూపించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఫోన్‌లను కూడా లోపలికి అనుమతించడం లేదు’ అంటూ అనురాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు.