తెలుగులో ‘శతమానం భవతి’, ‘కార్తికేయ’ వంటి హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈ మలయాళ నటి.. ఇప్పుడు మలయాళంలో ఓ పవర్‌ఫుల్ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ‘జానకి వర్సస్ స్టేట్ ఆఫ్ కేరళ’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది’ అనే ఉపశీర్షికతో రూపొందిన ఈ చిత్రం జూన్ 27న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా ఇప్పుడు టైటిల్ వల్ల పెద్ద వివాదాల్లో చిక్కుకుంది.
Also Read : Tammudu : నితిన్ ‘తమ్ముడు’ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్!
సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ పోషిస్తున్న బాధితురాలి పాత్రకు ‘జానకి’ అనే పేరు పెట్టడం సెన్సార్ బోర్డు ఇష్టపడలేదు. కారణం ఏమిటంటే ‘జానకి’ అనే పేరు సీతాదేవికి మరో రూపంగా పరిగణించబడుతోంది. దీంతో, ‘దేవీ సమానమైన పేరును అత్యాచార బాధితురాలికి పెట్టడం సరికాదు’ అంటూ సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. అందువల్ల టైటిల్‌తో పాటు క్యారక్టర్ పేరు మార్చకపోతే సర్టిఫికెట్ ఇవ్వబోమని స్పష్టం చేసింది.
ఈ వివాదాన్ని మలయాళ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా ధృవీకరించింది. ఇంతకు ముందూ ఇలాంటి సమస్యల్లో మరో సినిమా టైటిల్‌లో ‘జానకి’ పేరును ‘జయంతి’ గా మార్చిన సందర్భం ఉందని గుర్తు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ‘జానకి వర్సస్ స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్రయూనిట్‌కి రెండే మార్గాలు ఉన్నాయి.. ఒకటి టైటిల్‌తో పాటు, క్యారక్టర్ పేరును మారుస్తే సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉంది. నెక్ట్ లీగల్ గా పోరాటం, కోర్టులో కేసు వేయడం ద్వారా టైటిల్‌ను కొనసాగించే ప్రయత్నం చేయవచ్చు. మరి చిత్ర యూనిట్ ఏం చేస్తుందో.