Site icon NTV Telugu

Anandhi : తెలుగులో బిజీ అవుతున్న వరంగల్ పోరి

Is actress Anandhi expecting her first baby?

మారుతి తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ చిత్రాలు ఈ రోజుల్లో, బస్టాఫ్‌లో సపోర్టింగ్ రోల్స్ చేసిన తెలుగమ్మాయి ఆనంది.. ఇక్కడ సరైన గుర్తింపు రావడం లేదని కోలీవుడ్ బాట పట్టింది. అక్కడ తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. కాయల్, త్రిష.. ఇల్ల.. నయనతార, విచారణై, పరియేరుమ్ పెరుమాళ్ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపునిచ్చాయి. వెట్రి, మారి సెల్వరాజ్, అధిక్ రవిచంద్రన్ లాంటి స్టార్ దర్శకులతో వర్క్ చేసింది. కానీ సొంత గూటిలో ఫ్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మళ్లీ టాలీవుడ్ బాట పట్టింది అమ్మడు.

Also Read:Tollywood: తెలుగు సినిమాల్లో పనిచేయాలని ఉందా.. మీకు ఇదే గోల్డెన్ చాన్స్!

జాంబిరెడ్డితో ఫీమేల్ లీడ్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది ఆనంది. హమ్మయ్య బొమ్మ బ్లాక్ బస్టరైందని సంబరపడిపోయేలోపు ప్లాప్స్ పలకరిస్తూనే ఉన్నాయి. ఇక అదే టైంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది మేడమ్. మళ్లీ కెరీర్ డైలామాలో పడిపోతున్న టైంలో అల్లరి నరేష్‌తో ఇట్లు మారేడు మిల్లిలో కనిపించింది. నరేష్‌తో వర్క్ అంటే కెరీర్ ఖతమైనట్లే అన్న ట్యాగ్ పటాపంచులు చేస్తూ… ఎక్కడా బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉంది తెలంగాణ పోరీ.

Also Read:Kingdom : కింగ్ డమ్ నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?

తెలుగులో హిట్ ఆనందితో గేమ్ ఆడుతూనే ఉన్నా.. అవకాశాలకు కొదవ లేదు. త్రీ డిఫరెంట్ ప్రాజెక్టులతో ఎంటర్టైన్ చేయబోతుంది. ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి గరివిడి లక్ష్మీ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోన్న మూవీలో టైటిల్ రోల్ పోషిస్తోంది. ఇదే కాదు.. ప్రియదర్శన్ సరసన ప్రేమంటేతో పాటు సత్యదేవ్‌తో కలిసి ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. అరేబియన్ కడలి అనే సిరీస్ ఆగస్టు 8న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇలా వరుస అవకాశాలతో లైమ్ లైట్లో ఉంటుంది కానీ.. హిట్టే ఆమెతో దోబూచులాడుతోంది. మరీ ఆనంది హిట్ కొట్టి.. స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొడుతుందో లేదో..? చూడాలి.

Exit mobile version