తెలుగు ఫిలిం ఫెడరేషన్ కొంప మునిగే నిర్ణయం తీసుకుంది యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్. 2022 తర్వాత 2025లో మరోసారి 30% వేతనాలు పెంచాలని, పెంచకపోతే ఆయా నిర్మాతల షూటింగ్స్‌కి హాజరు కామని తెలుగు ఫిలిం ఫెడరేషన్ తేల్చి చెప్పిన సంగతి తెలిసింది. ఈ అంశం మీద ఈ ఉదయం నుంచి నిర్మాతలు ఫిలిం ఛాంబర్‌తో అనేక చర్చలు జరిపారు. ఈ రోజు సాయంత్రం ఫిలిం ఛాంబర్ ఆసక్తికరంగా ఒక లేఖ కూడా విడుదల చేసింది. దాని ప్రకారం యూనియన్‌లో వాళ్ళతోనే పని చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సినిమాల్లో పనిచేయాలని భావించే ఔత్సాహికులతో పాటు నిపుణులతో పని చేయించుకోవచ్చు అని తెలియజేసింది. దానికి యూనియన్ సభ్యులు అయి ఉండాల్సిన అవసరం లేదని కూడా వెల్లడించింది. ఆ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే తెలుగు యాక్టివ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ సినీ పరిశ్రమలో వివిధ క్రాఫ్ట్స్ కోసం ఔత్సాహికులను దరఖాస్తు చేయాల్సిందిగా కోరుతూ ప్రకటన విడుదల చేశారు.
Also Read: Tollywood : నెక్ట్స్ హవా అంతా కొత్త పాపలదే!
ప్రస్తుతానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్, స్క్రిప్ట్ సూపర్వైజర్లు, సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్‌కి సంబంధించి డిఓపిలు, కెమెరా అసిస్టెంట్లు, ఫోకస్ పుల్లర్లు, లైటింగ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి గ్యాఫర్లు, లైట్ అసిస్టెంట్లు, ఆర్ట్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ప్రొడక్షన్ డిజైనర్లు, ఆర్ట్ అసిస్టెంట్లు, సెట్ డ్రస్సర్లు, సౌండ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి సింక్ సౌండ్ రికార్డిస్ట్, అలాగే బూమ్ ఆపరేటర్లు, ఎడిటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్‌కి సంబంధించి ఎడిటర్లు, డిఐ ఆర్టిస్టులు, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్లు, అలాగే వాయిస్ ఆర్టిస్టులు, మేకప్‌కి సంబంధించి కాస్ట్యూమ్ డిజైనర్లు, మేకప్ ఆర్టిస్టులు, అలాగే నటీనటుల కోసం అసిస్టెంట్లు, అదేవిధంగా డాన్స్ కొరియోగ్రాఫర్లు, డాన్సర్లు, అలాగే స్టంట్స్, ఎస్‌ఎఫ్‌ఎక్స్ టెక్నీషియన్లు, ప్రొడక్షన్ మేనేజర్లు, ప్రొడక్షన్ అసిస్టెంట్లు, అలాగే ఇతర టెక్నికల్ అలాగే క్రియేటివ్ క్రూ కోసం దరఖాస్తు ఆశిస్తున్నట్లు ప్రకటించింది. అయితే దీనికి ఎలిజిబిలిటీ మరింత ఆసక్తికరంగా ఉంది. ఇంత చెప్పిన తర్వాత వారందరికీ ఆయా క్రాఫ్ట్స్‌లో సర్టిఫికేషన్ ఉండాలి లేదా
Also Read: Kingdom : కింగ్ డమ్ నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
గతంలో సినిమాలకు, వెబ్ సిరీస్ లేదా ఏదైనా కమర్షియల్ యాడ్స్‌కి పనిచేసిన అనుభవం ఉండాలి. అలాగే ఆఫీసుల్లో కాకుండా అవసరం ఉన్న చోట పని చేసే వారే కావాలని కోరారు. దానికి సంబంధించి వెబ్‌సైట్ అడ్రస్‌తో పాటు మెయిల్ ఐడీ కూడా ఇచ్చారు. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఆసక్తి ఉంటే ఒక ప్రయత్నం చేసి చూడండి మరి.
Apply Now: 🔗 https://atfpg.com/form.html
📧 : info@atfpg.com