Amba’s Revenge: తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం.. తొలి ఏఐ చిత్రంగా ‘అంబ’s రివెంజ్’!
- తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం
- తొలి ఏఐ చిత్రంగా 'అంబ’s రివెంజ్'
- హనుమాన్ విజయోత్సవం సందర్భంగా టైటిల్ పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికే విధంగా.. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందుతున్న తొలి ఫీచర్ ఫిల్మ్ ‘అంబ’s రివెంజ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సాంకేతిక విప్లవాన్ని తెరపైకి తీసుకువస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ చిత్రాన్ని నిర్మాత శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మిస్తుండగా.. రాణి మాడిసన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ లలితకళా ఫిలిమ్స్, నక్క తోక ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. పౌరాణిక ఇతిహాసమైన మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ కథను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని వినూత్నంగా తెరకెక్కిస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో పాటు ఏఐ టూల్స్ వినియోగంతో విజువల్స్, పాత్రల రూపకల్పన, కథన నిర్మాణం వంటి అంశాలను కొత్త శైలిలో ఆవిష్కరించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
Also Read
- Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ రెడ్డి కుందూరు మరియు క్రియేటివ్ డైరెక్టర్ జయవర్ధన్ మాడి మాట్లాడుతూ… ‘తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. అంబ’s రివెంజ్ ద్వారా అత్యాధునిక ఏఐ టెక్నాలజీని వినియోగిస్తూ సినిమా నిర్మాణంలో కొత్త ప్రమాణాలను స్థాపించబోతున్నాం. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తాం’ అని తెలిపారు. పౌరాణిక కథను ఆధునిక సాంకేతికతతో మిళితం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో కొత్త దిశగా అడుగులు వేస్తోందని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Imran Tahir: “ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్..” 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. ఇమ్రాన్ తాహిర్ రికార్డు.!
-
Mobile Addiction Turns Fatal: భోజనం చేస్తూ రీల్స్ చూస్తుండగా.. పదేపదే నెట్వర్క్ ప్రాబ్లం.. మహిళ షాకింగ్ నిర్ణయం
-
iPhone Duo vs iPhone 18 Pro: ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ vs ఐఫోన్ 18 ప్రో.. రోజువారీ వాడకానికి ఏది బెస్ట్?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్..
-
Relationship Blindness: ప్రేమ ఉన్నా మాటలే లేవా?
ట్రెండింగ్
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..