KKR vs SRH Playing 11: కేకేఆర్ vs ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!
- ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ vs ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్
- కేకేఆర్ vs ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 ఇదే
- కేకేఆర్ vs ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KKR vs SRH Head-to-Head: ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్లు గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లలో ఓటమి ఎదుర్కొన్న కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ టీమ్స్ తిరిగి గెలుపు బాట పట్టాలని చూస్తున్నాయి. ఈ సీజన్‌లో బౌలింగ్‌పై ఏమాత్రం అంచనాలు లేని సన్‌రైజర్స్ ఎలా ఆడుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాట్ కమిన్స్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
లియామ్ లివింగ్‌స్టోన్ ఆడుతాడా?:
ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు కీలక ఆటగాళ్ల గైర్హాజరీ పెద్ద సమస్యగా మారింది. జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా దూరం కాగా, అతని స్థానంలో ఇషాన్ కిషన్ జట్టును నడిపిస్తున్నాడు. ఇంగ్లాండ్ పేసర్ బ్రైడన్ కార్స్ కూడా గాయం వల్ల దూరమయ్యాడు. దీంతో గత మ్యాచ్‌లో డెబ్యూ చేసిన డేవిడ్ పేన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగనున్నాడు. విదేశీ ఆటగాళ్ల ఎంపికలో ఎస్‌ఆర్‌హెచ్‌కు కఠిన నిర్ణయం ఎదురవుతోంది. నాలుగో విదేశీ ఆటగాడిగా లియామ్ లివింగ్‌స్టోన్, ఈషాన్ మలింగలో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. బౌలింగ్ లేని ఎస్‌ఆర్‌హెచ్ ఎలా ఆడుతుందో చూడాలి.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
పావెల్‌కు మరోసారి నిరాశ:
కేకేఆర్ విషయానికి వస్తే కెప్టెన్ అజింక్య రహానే గాయం కలవరపెట్టినా.. ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. జట్టు ప్రధాన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్‌లో లేకపోయినా అతనిపై పూర్తి విశ్వాసం ఉంచారు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ తరఫున కామెరాన్ గ్రీన్
ఆడనుండగా.. రోవ్‌మన్ పావెల్‌కు మరోసారి నిరాశ తప్పదు. ఫిన్ అలెన్, సునీల్ నరైన్, బ్లెస్సింగ్ ముజరబాని విదేశీ ఆటగాళ్లుగా కొనసాగనున్నారు.
పిచ్ రిపోర్ట్:
కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ముఖాముఖిగా 30 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో కేకేఆర్ 20 మ్యాచులు గెలవగా.. ఎస్‌ఆర్‌హెచ్ 10 గెలిచింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై భారీ స్కోర్లు నమోదు కానున్నాయి. వేసవి కావడంతో మంచు ప్రభావం తక్కువ ఉంటుంది.
తుది జట్లు (అంచనా):
కేకేఆర్: ఫిన్ అలెన్, అజింక్య రహానే (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశి (వికెట్ కీపర్), రింకు సింగ్, రామదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, బ్లెస్సింగ్ ముజరబాని, కార్తిక్ త్యాగి.
ఎస్‌ఆర్‌హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, సలిల్ అరోరా, హర్ష్ దూబే, ఈషాన్ మలింగ/లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ పేన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..