Ambajipeta Marriage Band Heroine Shivani Nagaram Interview: సుహాస్ హీరోగా నటిస్తున్న “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది పక్కా హైదరాబాదీ పిల్ల శివాని నాగరం. ఈ సినిమాని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయాన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీ హైలైట్స్ చెప్పింది హీరోయిన్ శివాని నాగరం. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” లాంటి మంచి మూవీతో టాలీవుడ్ లో అడుగుపెడుతుండటం అదృష్టంగా భావిస్తున్నానని, ఒక పెద్ద బ్యానర్ లో మంచి టీమ్ ఉన్న సినిమాతో పరిచయం కావడం హ్యాపీగా ఉంది. ఎగ్జైటింగ్ గా, నెర్వస్ నెస్ కూడా ఫీలవుతున్నా అని ఆమె అన్నారు.. నేను ఈ సినిమా చూశాను కాబట్టి కాన్ఫిడెంట్ గా ఉన్నా… మీరంత చూసి ఇచ్చే రెస్పాన్స్ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నా, ఒక పెద్ద సినిమాలో యాక్టర్స్ గా మాకూ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఆ బాధ్యతతో నెర్వస్ నెస్ అనిపిస్తోంది. మా టీమ్ అంతా పూర్తిగా పాజిటివ్ గా ఉన్నామని ఆమె అన్నారు..
Guntur Kaaram Negative Publicity: గుంటూరు కారంపై నెగిటివ్ పబ్లిసిటీ.. నలుగురు అరెస్ట్
మాది హైదరాబాద్, ఈ సినిమా కోసం ఫస్ట్ టైమ్ మరో ఊరికి వెళ్లాను. షూటింగ్ అంతా హ్యాపీగా జరిగింది. 75 రోజుల పాటు అమలాపురం, అంబాజీపేట ..ఆ ప్రాంతంలో ఉన్నాం. లోకల్ గా ఉన్న బ్యుటిఫుల్ వెదర్, ప్లెజంట్ అట్మాస్పియర్ ను ఎంజాయ్ చేశాం. అక్కడి వారు కూడా చాలా లవ్ చూపిస్తారు, వాళ్ల ఇంటికి భోజనానికి పిలిచేవారు, వెళ్లకుంటే వాళ్లకు కోపం కూడా వచ్చేది. ఈ మూవీలో నా క్యారెక్టర్ కు స్పెషల్ గా యాస ఏదీ ఉండదు. మామూలు తెలుగులోనే మాట్లాడుతుంటా, ఒక్కడో ఒక దగ్గర స్లాంగ్ తో డైలాగ్ చెప్పమనేవారు. ఈ సినిమాలో అవకాశం నాకు ఆడిషన్ ద్వారానే వచ్చింది. ఇన్ స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ పంపారు, నేను హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కోసం ఆడిషన్ అని వెళ్లాను. అయితే ఆడిషన్ తీసుకున్న తర్వాత హీరోయిన్ గానే తీసుకుంటున్నారు అని చెప్పారు. ఫస్ట్ డే షూట్ చేసే వరకు నేనే హీరోయిన్ అనేది నమ్మలేకపోయాను. ఒక మంచి స్క్రిప్ట్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుండటం లక్కీగా అనిపించింది. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” లో నా క్యారెక్టర్ పేరు లక్ష్మి. ఇందులో కొన్ని ఎమోషనల్ సీన్స్ చేయడం ఛాలెంజింగ్ గా ఉండేది. అయితే మేము షూటింగ్ కు ముందు నెల రోజుల పాటు బాగా ప్రిపేర్ అయ్యా, ప్రతి డైలాగ్ నేర్చుకున్నా. సీన్స్ ఇంకా పర్పెక్ట్ గా చేయాలని ఉండేది. ఈ ప్రిపరేషన్ వల్ల సెట్ లో నటించడం కష్టమనిపించలేదు. రియల్ లైఫ్ లో నేను కూచిపూడి డాన్సర్ ని, పిల్లలకు సంగీతం నేర్పిస్తుంటా. అయితే ఈ సినిమాలో పాట పాడటం, డ్యాన్స్ చేయడానికి అవకాశం దొరకలేదు. నెక్స్ట్ ఫిలింలో ట్రై చేస్తా, యాక్టింగ్ గురించి మొదట్లో తెలియదు. ట్రైనింగ్ తీసుకున్నా.