అల్లు అర్జున్ , డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సెన్సేషనల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అట్లీ ఫస్ట్ టైమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి విడుదల చేసిన ఎనౌన్స్మెంట్ వీడియో ఇప్పటికీ సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. లాస్ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా హీరో అల్లు అర్జున్, హాలీవుడ్ టెక్నిషియన్స్, డైరెక్టర్ అట్లీపై చిత్రీకరించిన ఈ ప్రత్యేక వీడియో అందరినీ ఆకట్టుకుంది. దీంతో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ కాబోతుందా..? అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : Balagam : బలగం నటుడు కన్నుమూత..
ఇక ఇప్పటికే, ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతుండగా ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా గురించి మరో క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఏంటీ అంటే, ఈ మూవీలో హీరోయిన్ నజ్రియా నజీమ్ నటించనుందట. అది కూడా ఆమె ఈ సినిమాలో బన్నీకి సిస్టర్ రోల్లో కనిపించబోతున్నట్లు, ఈ పాత్ర చాలా ఎమోషనల్ టోన్‌లో సాగుతుందని టాక్ నడుస్తోంది. మరి నిజంగానే నజ్రియా నజీమ్, బన్నీకి సిస్టర్ రోల్ లో నటిస్తుందా ?, నటిస్తే మాత్రం నిజంగా కాంబినేషన్ అదిరిపోతుంది. ఇక నజ్రియా నజీమ్.. తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిన హీరోయిన్. ‘రాజా రాణి’ చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనా ఈ ముద్దుగుమ్మ. నేచురల్ స్టార్ నాని సరసన ‘అంటే.. సుందరానికి’ చిత్రంలో నటించి మెప్పించింది. రీసెంట్గా ఈ బ్యూటీ మలయాళంలో ‘సూక్ష్మదర్శిని’ అనే చిత్రం ముఖ్యపాత్ర పోషించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఏకంగా బన్ని మూవీలో ఛాన్స్ కొట్టేసింది అనే వార్తలు వినపడుతున్నాయి. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.