Allu Arjun: దుల్కర్ ఒక స్టార్ కిడ్ అయినా ఆ పొగరు ఏమాత్రం ఉండదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: దుల్కర్ సల్మాన్ హీరోగా, గీతా ఆర్ట్స్ – స్వప్న సినిమా కలిసి నిర్మిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా హీరో దుల్కర్ సల్మాన్ గురించి బన్నీ చాలా ఆసక్తికరమైన మాటలు చెప్పారు. ఒక పెద్ద స్టార్ హీరో కొడుకై ఉండి కూడా దుల్కర్‌లో ఆ స్టార్ యాటిట్యూడ్ గానీ, పొగరు గానీ అస్సలు ఉండదని, అందరితో చాలా సింపుల్‌గా కలిసిపోతాడని అల్లు అర్జున్ మెచ్చుకున్నారు. స్టేజ్ మీద దుల్కర్ గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ తన అభిమానాన్ని బయటపెట్టారు. దుల్కర్ మొదటి మలయాళ సినిమా నుంచే ఆయన కెరీర్‌ను గమనిస్తున్నానని, తమిళంలో మణిరత్నం లాంటి గొప్ప దర్శకులతో పనిచేసి, తెలుగులో ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ లాంటి మంచి సినిమాలు చేశారని అన్నారు.
“దుల్కర్ ఒక పెద్ద స్టార్ కిడ్. కానీ ఆయన పక్కన ఉంటే ఏమాత్రం ఆ స్టార్ ప్రెజెన్స్ గానీ, ఆ పొగరు గానీ కనిపించదు. ప్రతి ఒక్కరినీ ఎంతో ఫ్రీగా, ఆప్యాయంగా పలకరిస్తారు. ఆయనలోని ఈ మంచి గుణమే ఇంత పెద్ద సక్సెస్ ఇస్తోంది. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగానూ ఆయన తీసిన ‘లోక’ సినిమా నాకు చాలా నచ్చింది. యాంకర్ సుమ గారి తర్వాత తెలుగు వాళ్లు ఇంతలా ఇష్టపడే మలయాళీ వ్యక్తి దుల్కర్ సల్మాన్ మాత్రమే” అని బన్నీ అన్నారు. సాధారణంగా నిర్మాత, తన ఫాదర్ అల్లు అరవింద్ ఏ సినిమా విషయంలోనూ అంత త్వరగా ఎక్సైట్ అవ్వరని, కానీ ‘ఆకాశంలో ఒక తార’ విషయంలో ఆయన చాలా హ్యాపీగా, ఉత్సాహంగా ఉన్నారని బన్నీ చెప్పారు. “మా నాన్నగారు ఒక సినిమా గురించి ఇంత ఎక్సైట్ అవుతున్నారంటే అది కచ్చితంగా మంచి సైన్. ఈ సినిమాలో ఏదో బలమైన ఆత్మ ఉంది. టీజర్ చూసినప్పుడు నాకు కూడా ఆ పాజిటివ్ వైబ్ తగిలింది. ప్రతి ఆడపిల్ల కల నిజం కావాలనే ఒక మంచి పాయింట్‌తో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది” అని అన్నారు. అలాగే గీతా ఆర్ట్స్ సీఈఓగా తన అక్క విద్య, స్వప్న సినిమా తరపున స్వప్న దత్, ప్రియాంక దత్‌లు రెండో తరం నిర్మాతలుగా మంచి సినిమాలు తీస్తూ ముందుకు వెళ్లడం చాలా గర్వంగా ఉందన్నారు.
Also Read
- Dulquer Salmaan: మేమిద్దరం 'నెపో కిడ్స్'.. కానీ బ్యాక్‌గ్రౌండ్ లేని కొత్తమ్మాయిని లాంచ్ చేయడం మా అదృష్టం!
- Satvika Veeravalli: రెండు ఇంజినీరింగ్ డిగ్రీలు, అమెరికా జాబ్ వదిలేసి హీరోయిన్గా వచ్చా: సాత్విక వీరవల్లి
- Aakasamlo Oka Tara: 'రేసుగుర్రం' షూటింగ్ టైంలో బన్నీ అన్న చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను: పవన్ సాధినేని
- Aakasamlo Oka Tara: నాని తర్వాత ఆ పాత్రకు దుల్కరే కరెక్ట్: అల్లు అరవింద్
ఈ సినిమాతో పరిచయమవుతున్న కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లికి ఇదొక డ్రీమ్ లాంచ్ అని, ఇంతమంది స్టార్స్ మధ్య తెలుగు సినిమాతో ఆమె కెరీర్ మొదలవడం హ్యాపీగా ఉందని బన్నీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఒక కమర్షియల్ స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా శృతి హాసన్ ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తూ సపోర్ట్ చేయడం చాలా గ్రేట్ అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ ఏడాది వరుస హిట్లు కొడుతున్నారని, ‘లక్కీ భాస్కర్’ తర్వాత దుల్కర్‌తో ఇది రెండో హిట్ అవుతుందని, త్వరలోనే వీరి కాంబో హ్యాట్రిక్ కొట్టాలని కోరుకున్నారు. డైరెక్టర్ పవన్ సాధినేని గురించి మాట్లాడుతూ.. “పవన్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్. ఆయనకు రావాల్సిన గుర్తింపు ఇంకా రాలేదని నేను ఎప్పుడూ అనుకునేవాడిని. ఈ సినిమాతో ఆయనకు ఆ పేరు కచ్చితంగా వస్తుంది” అని అన్నారు. చివరగా తన ఫ్యాన్స్ (ఆర్మీ) అందరికీ థ్యాంక్స్ చెబుతూ, త్వరలోనే ఒక మంచి రాకా అప్డేట్తో మీ ముందుకు వస్తానని బన్నీ చెప్పారు.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Allu Arjun: దుల్కర్ ఒక స్టార్ కిడ్ అయినా ఆ పొగరు ఏమాత్రం ఉండదు
-
Dulquer Salmaan: మేమిద్దరం ‘నెపో కిడ్స్’.. కానీ బ్యాక్‌గ్రౌండ్ లేని కొత్తమ్మాయిని లాంచ్ చేయడం మా అదృష్టం!
-
Sun Transit : రేపు సూర్యుడి రాశి మార్పుతో అదృష్టం.. ఈ 8 రాశులకు శుభ ఘడియలు!
-
ICC Schedules: 2035 వరకు ఐసీసీ క్రికెట్ టోర్నీల షెడ్యూల్ విడుదల.. ఇండియాలో ఆ వరల్డ్ కప్..
-
Akhilesh Ayodhya Visit: ‘‘నమాజ్ చేసిన ప్రాంతానికి వెళ్తున్నారు’’.. అఖిలేష్ ‘‘రామమందిర’’ సందర్శనపై ఓవైసీ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!