Bigg Boss 8 Telugu: పక్కాగా పోలీస్ ప్లానింగ్.. ఆల్ హ్యాపీస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 01 ఆదివారం నాడు ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 నిన్న ఆదివారంతో ముగిసింది. దాదాపు 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్ సీజన్ 8లో విజేతగా కన్నడ నటుడు నిఖిల్ మలియక్కల్ బిగ్‌బాస్ సీజన్ 8 గెలిచి కప్ న అందుకున్నాడు. బిగ్‌బాస్ సీజన్ 8 తెలుగులో ముందు ఎంటర్ అయిన వారు, వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ మొత్తం 22 మంది పాల్గొనగా ఫినాలే వీక్‌కి చేరేసరికి గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్‌లు టాప్ 5లో నిలిచారు. నిఖిల్ వర్సెస్ గౌతమ్‌ల మధ్య విన్నింగ్ రేస్ ఉండగా నిఖిల్ విజేతగా నిలవగా గౌతమ్ రన్నరప్‌గా నిలిచాడు. విజేత నిఖిల్ రూ.55 లక్షల ప్రైజ్‌మనీతో పాటు.. మారుతీ సుజూకీ కారును సొంతం చేసుకున్నాడని నిర్వాహకులు తెలిపారు. నిఖిల్ సొంతూరు కర్ణాటకలోని మైసూరు కాగా గోరింటాకు సీరియల్ ద్వారా పార్థుగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక హీరో రాంచరణ్ చేతుల మీదుగా విన్నర్ నిఖిల్‌కు రూ.55 లక్షల చెక్కు అందజేశారు.
Allu Arjun: శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై అల్లు అర్జున్ పోస్ట్
Also Read
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
- Dil Raju: రాకింగ్ స్టార్ యశ్‌తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
- Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
గత సీజన్లో పల్లవి ప్రశాంత్ గెలిచిన సమయంలో హైదరాబాదు అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పెద్ద దుమారమే రేగింది. అనేక మంది యువకులు ర్యాలీ చేసేందుకు రావడంతో పోలీసులు ఇబ్బందులు పడ్డారు. కప్ అందుకున్న కొద్ది గంటలకే పల్లవి ప్రశాంత్ అరెస్టు కూడా అయ్యాడు. అయితే ఆ అనుభవంతో నిన్న 300 మంది పోలీసులతో అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్లే అన్ని దారులను బారీకేడ్లతో మూసేసి పోలీసులు రంగంలోకి దిగారు. ఊరేగింపుకు పోలీసులు అనుమతి ఇవ్వని కారణంగా ఎలాంటి ర్యాలీ లేకుండా సైలెంట్‌గా ఇంటికి వెళ్లిపోయాడు విన్నర్ నిఖిల్. అలా మొత్తం మీద పోలీసుల చొరవతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆల్ హ్యాపీస్ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!