అల్లు అర్జున్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్‌లోనే కాకుండా, ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక VFX షాట్స్‌తో ఈ సినిమా రూపొందుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్‌లో బన్నీతో పాటు అట్లీ చాలా కీలకంగా వ్యవహరించారు. సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోతోనే ప్రేక్షకుల్లో ఒక రకమైన బజ్ ఏర్పడింది.
Also Read:Vijay Varma : విజయ్ వర్మతో డేటింగ్ పై దంగల్ బ్యూటీ క్లారిటీ..
సినిమా జానర్ ఏమిటనే విషయంపై స్పష్టత లేనప్పటికీ, అల్లు అర్జున్ ఒక VFX సినిమా చేస్తున్నాడని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన VFX పనులను అమెరికాలోని టాప్ VFX కంపెనీలకు అప్పగించినట్లు తెలుస్తోంది. సినిమా VFX పనులను చూసుకునేందుకు ఒక VFX ఎక్స్‌పర్ట్ Team అమెరికా నుంచి ముంబై వచ్చినట్లు సమాచారం. వారు సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు ముంబైలోనే ఉండబోతున్నారని, అలాగే సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ అమెరికాలో కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు ముంబైలో షెడ్యూల్ జరగనుంది.
Also Read:Kannappa: ‘కన్నప్ప’కి మంచు మనోజ్ విషెస్.. మంచు విష్ణుని మాత్రం?
ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు, కానీ ఆమె ఇంకా షూటింగ్‌లో జాయిన్ కావాల్సి ఉంది. మృణాళ్ ఠాకూర్‌తో పాటు జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. మరోవైపు, బన్నీ కూడా ముంబైలోనే ఉంటూ సినిమా షూటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
