తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ 22వ చిత్రం లాక్ అయిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని, భారీ బడ్జెట్‌తో హై వీఎఫ్‌ఎక్స్ టెక్నాలజీని వాడుకుంటూ ఊహించని విధంగా తెరకెక్కించబోతున్నారు.అయితే ఇలాంటి సినిమాలో హీరోయిన్‌ని సెలక్ట్ చేయడం అంటే ఛాలెంజింగ్ అనే చెప్పాలి. అందుకే ఇప్పటి వరకు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని ప్రచారం పీక్స్ లో జరుగుతుంది. ఇందులో భాగంగా చాలా మంది బ్యూటీల పేర్లు తెరపైకి వచ్చాయి. దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, అనన్య పాండే, సమంత పేర్లు తెరపైకి రాగా. వీళ్లలో ముగ్గురు భామలు ఎవరు అవుతారు? అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ అందరూ ఎక్కువగా సామ్‌కే ఓటేశారు కానీ. తన ‘శుభం’ మూవీ ప్రమోషన్స్ దీని పై క్లారిటీ ఇచ్చింది.
Also Read: Amala Paul : నేను హీరోయిన్‌ని అనే విషయం నా భర్తకి చెప్పలేదు..
నేపథ్యంలో తాజాగా కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి పేరు తెరపైకి వస్తుంది. ఇందులో అల్లు అర్జుకి మెయిన్ లీడ్ గా ఈ భామనే తీసుకుంటున్నారనే కొత్త వార్తలు వెలుగులోకి వచ్చాయి. అట్లీ రాసిన పాత్రకు శ్రీనిధి పర్పెక్ట్‌గా సెట్ అవుతుందని అందుకే తొలి అవకాశం ఆమెకే ఇస్తున్నట్లు కోలీవుడ్ టాక్. ఇక రీసెంట్ గా ‘హిట్ 3’లో ఈ అమ్మడు యాక్టింగ్ కు మంచి మార్కులు పడగా, గ్లామర్ పరంగా కూడా బాగానే ఆకట్టుకుంది. మరి బన్నీ మూవీలో ఈ శ్రీనిధి శెట్టి.. ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.