Site icon NTV Telugu

Coolie: అందరి కళ్లూ ‘కూలీ’పైనే!

Coolie

Coolie

రేసీ స్క్రీన్‌ప్లేతో పర్‌ఫెక్ట్‌ యాక్షన్‌తో హాలీవుడ్‌ సినిమా చూపించే దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌. ఖైదీ, విక్రమ్‌ సూపర్‌ హిట్‌ సినిమాలతో పాన్‌ ఇండియా రేంజ్‌లో క్రేజ్‌ ఫేమ్‌ సంపాదించుకున్నాడు ఈ దర్శకుడు. ఈ రెండు సినిమాల సక్సెస్‌తో లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ స్టార్ట్‌ చేసాడు.. ఆ తర్వాత వచ్చే సినిమాల్లో ఇదే కథను కంటిన్యూ చేశారు.. ఈ సిరీస్‌లో భాగంగా తర్వాత వచ్చిన సినిమా విజయ్‌ నటించిన లియో.

Also Read:Anaswara Rajan: స్పీడు మీదున్న అనశ్వర రాజన్

వరుస సక్సెస్‌లు చూసిన లోకేష్‌ దళపతి విజయ్‌తో చేసిన లియో సినిమా అనుకున్నంత సక్సెస్‌ కాలేదు. పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ అయిన ఈ మూవీ ఒక్క తమిళ్‌లో తప్ప ఇతర చోట్ల అంతగా ఆడలేదు. దాంతో తను చేయబోయే నెక్స్ట్‌ సినిమా పైన చాలా డౌట్స్‌ వచ్చాయి. రజనీకాంత్‌ మూవీ స్టార్ట్‌ చేయగానే అభిమానుల నుండి తీవ్ర ఒత్తిడి ఎదురైంది. దీంతో రాత్రి పగలు చాలా రెస్ట్‌లెస్‌గా వర్క్‌ చేసి సినిమాను ఫినిష్‌ చేసాడు.. సినిమా ఫస్ట్‌ కాపీ రజనీకాంత్‌ కి చూపించిన తర్వాతే ప్రశాంతంగా నిద్ర పోయాను అని దర్శకుడు లోకేష్‌ ఓ హాలీవుడ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

Also Read:Fahadh Faasil: ఫహద్’ది కీప్యాడ్ ఫోనే కానీ 10 లక్షలు!

LCU సిరీస్‌లో భాగంగా రజనీకాంత్‌తో చేయబోయే ప్రాజెక్ట్‌, ఒక అధ్భుతమైన సినిమాగా నిలిచిపోవాలని లోకేష్‌ కనగరాజ్‌ సినిమా కాస్టింగ్‌ విషయంలో చాలా కేర్‌ తీసుకున్నాడు. ఎంతో ప్రెస్టీజియస్‌గా చేస్తున్న ఈ మూవీలో కన్నడ నుండి ఉపేంద్ర, మళయాలం నుంచి సౌబిన్‌ షాహిర్‌, బాలీవుడ్‌ నుంచి అమీర్‌ఖాన్‌, తెలుగు నుంచి నాగర్జున లాంటి నటులను రంగంలోకి దింపాడు. అయితే మిగతావాళ్లను సినిమాకు ఒప్పించడం ఒకెత్తు అయితే నాగార్జున ఒప్పించడం మరో ఎత్తు అయిందని, దానికి నాలుగైదు నెలలు టైం పట్టిందని డైరెక్టర్‌ లోకేష్‌ స్వయంగా చెప్పాడు. అంతేకాదు అమీర్‌ఖాన్‌తో చేయబోయే సినిమా సంథింగ్‌ స్పెషల్‌ అని తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ డిటైయిల్స్‌ తెలియజేసాడు లోకేష్‌ కనగరాజ్‌.

Exit mobile version