నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. అంతటి సంచనల కాంబోలో మరో సినిమా వస్తోంది. అఖండ తో చిత్ర పరిశ్రమలు ఊపునిచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ గా ‘అఖండ-2′ ను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 గ్లిమ్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు.
Also Read : Dulquer Salman : మా ఇండస్ట్రీలో రూ. 30 కోట్ల బడ్జెట్ అంటే చాలా ఎక్కువ..
కాగా ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నామని ఆ మధ్య అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను తెలుగుతో పాటు పాన్ ఇండియా బాషలలో రిలీజ్ చేసేలా భారీ ప్లానింగ్ చేసారు. కానీ అనుకోని కారణాల వలన రిలీజ్ వాయిదా వేశారు. అయితే ఇప్పుడు అఖండ 2 లేటెస్ట్ రిలీజ్ డేట్ ను లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే డేట్ కు రావాల్సిన రాజాసాబ్ జనవరికి పోస్ట్ పోన్ అయింది. దాంతో అఖండ 2 కు సోలో రిలీజ్ డేట్ దొరికింది. బాలయ్య ఆస్థాన సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా బాలయ్య కుమార్తె తేజస్వీని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట-గోపీ అచంట ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ సినిమా ఓటీటీ రైట్స్ బాలయ్య కెరీర్ లోనే భారీ ధరకు అమ్ముడయ్యాయి.