బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో నందమూరి బాలకృష్ణ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. గతంలో వచ్చిన అఖండ సినిమాకి సీక్వెల్‌గా అఖండ 2 షూట్ చేస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. కొత్త షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న ఒక షూటింగ్ షెడ్యూల్ కోసం ప్రస్తుతం బోయపాటి శ్రీను లొకేషన్స్ రెక్కీ చేస్తున్నారు.
Mani Sharma – Bheems : అప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో భీమ్స్ ముచ్చట్లు!
ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయాల్సిన కారణంగా, అది ఎక్కడ చేయాలని ఆలోచించి, నందమూరి బాలకృష్ణ గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కోసం షూట్ చేసిన జార్జియా ప్రదేశాన్ని ఫిక్స్ చేశారు. ఇప్పటికే బోయపాటి రెక్కీ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ తాజాగా పద్మ అవార్డు అందుకున్నారు. వచ్చే వారం మొదలు కాబోతున్న షెడ్యూల్ కోసం ఆయన బయలుదేరి జార్జియా వెళ్తున్నారు. గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి లొకేషన్స్‌లోనే అఖండ 2 యాక్షన్ సీక్వెన్స్ కూడా ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది.