Mani Sharma – Bheems : అప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో భీమ్స్ ముచ్చట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెలోడీ బ్రహ్మగా, స్వరబ్రహ్మగా మణిశర్మను పిలుస్తూ ఉంటారు ఆయన అభిమానులు. ఇప్పుడు కాదు కానీ, ఒకప్పుడు తెలుగులో వరుస సూపర్ హిట్‌లు కొట్టాడు. తెలుగులో మెలోడీ సాంగ్ రావాలంటే వెంటనే మణిశర్మకు ఫోన్ వెళ్లాల్సిందే. అలా కొంతకాలం పాటు తెలుగు సంగీత ప్రపంచాన్ని ఏలిన ఆయన, తర్వాత దేవిశ్రీప్రసాద్, తమన్, జీవీ ప్రకాష్ కుమార్ వంటి వాళ్లు ఫామ్‌లోకి రావడంతో కాస్త సినిమాలు తగ్గించాడు. ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు, కానీ ఒకప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు. ప్రస్తుతానికి ఆయన రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ, అప్పుడప్పుడు పాకెట్ మనీ కోసమన్నట్లు సినిమాలు చేస్తున్నాడు. అలాంటి మణిశర్మతో ప్రెసెంట్ మ్యూజిక్ సెన్సేషన్‌గా మారిన భీమ్స్ సిసిరోలియో మాటామంతి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
Bheems Ceciroleo: భీమ్స్ పేరులో ‘సిసిరోలియో’ అంటే ఏంటో తెలుసా?
Also Read
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
- Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
అదేంటి, వీరు ఎక్కడ కలిశారు అని అనుమానం రావచ్చు. వీరిద్దరూ హైదరాబాద్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న కేబీఆర్ పార్క్‌లో వాకింగ్‌కి వెళ్తారు. అక్కడే వీరిద్దరూ కలిసి ముచ్చటించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకప్పటి మెలోడీ బ్రహ్మ నుంచి ప్రెసెంట్ మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ ఏవో టిప్స్ నేర్చుకుంటున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంమీద, వీరిద్దరూ కలిసి ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం బీమ్స్, అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, మణిశర్మ ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన ఆల్బమ్స్ ఇప్పటికీ చాలామందికి హాట్ ఫేవరెట్.
మెలోడీ బ్రహ్మ @ManiSharmaMusic తో ప్రజంట్ సెన్సేషన్#BheemsCeciroleo #KBRPark వాకింగ్ లో సరదాగా మాటామంతీ
మ్యూజిక్ మెజీషియన్స్ pic.twitter.com/ICbHQUQCMz— The Cult Cinema (@cultcinemafeed) April 29, 2025
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..