కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హైప్రొఫైల్ ప్రాజెక్ట్ ఇప్పటికే పోస్టర్‌లతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో తమిళ చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్‌లో అజిత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అదరగొట్టారు. విదాముయార్చి తో నిరాశపడిన అజిత్ ఫ్యాన్స్ కు GBA భారీ హిట్ ఇస్తుందని ధీమాగా ఉన్నారు.
Also Read : VIJAY : నేడు విజయ్ ‘TVK’ పార్టీ రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మార్క్ ఆంటోని విజయం తర్వాత, స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్, అజిత్ కుమార్ ను ఫ్యాన్స్ కోరుకున్న విధంగా చూపిస్తున్నాడు. కాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకిటించారు మేకర్స్. ఈ నెల 28న గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ ను రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ వీడియో రిలీజ్ చేసారు. ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష కృష్ణన్ ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. రమ్య పాత్రలో త్రిష కనిపించనుందని ఇటీవల రిలిజ్ చేసిన వీడియో ఆకట్టుకుంది. కోలీవుడ్ సీనియర్ నటుడు ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్ కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సౌండ్‌ట్రాక్ అందించగా, అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఏప్రిల్ 10, 2025న విడుదలవుతున్న ఈ చిత్రం వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా నిలిచింది.