సైతాన్ తర్వాత అజయ్ దేవగన్ బ్లాక్ బస్టర్ చూడలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు సిక్స్ మూవీస్ వస్తే కాస్త బెటర్ అనిపించాయి రైడ్2, సింగం సీక్వెల్ సింగం ఎగైన్. మైదాన్ ప్రసంశలు దక్కించుకుంది కానీ కాసులు కురిపించుకోలేకపోయింది. సన్నాఫ్ సర్దార్2 ఆల్ట్రా డిజాస్టర్. ఇక మిగిలిన సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక స్ట్రైట్ మూవీస్ కన్నా కాస్తో కూస్తో బెటర్ అనుకున్నాడేమో ఫ్రాంచైజీ చిత్రాలతోనే నెట్టుకొస్తున్నాడు కాజోల్ హస్బెండ్. ప్రజెంట్ ఆయన చేతిలో రేంజర్ మినహా మిగిలివన్నీ సీక్వెల్సే కావడం విశేషం.
Also Read : Dil Raju : పవర్ స్టార్ కోసం రెండు స్క్రిప్ట్ లు రెడీ చేస్తున్న దిల్ రాజు టీమ్
2019లో హిట్టుబొమ్మగా నిల్చిన దేదే ప్యార్ దే సీక్వెల్లో నెక్ట్స్ కనిపించబోతున్నాడు అజయ్ దేవగన్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న బొమ్మ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా ఫ్రాంచైజీలో కంటిన్యూ అవుతుండగా.. టబు ఈసారి మిస్ కానుంది. ఇక ధమాల్ సిరీస్ నుండి మరో ఫిల్మ్ రాబోతుంది. నెక్ట్స్ ఇయర్ ఈద్ సందర్భంగా అంటే మార్చి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఫన్ రైడర్ ఫిల్మ్ ధమాల్4. ఇవే కాదు అజయ్ దేవగణ్ నుండి మరో టూ ఫ్రాంచైజీ చిత్రాలు చూడబోతున్నాం. గోల్ మాల్ సిరీస్ నుండి ఫిప్త్ ఇన్ స్టాల్ మెంట్ మూవీ ఉండబోతున్నట్లు ఎప్పుడో అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. కానీ ఇంకా సెట్స్ పైకి వెళ్లిన దాఖలాలు లేవు. డిసెంబర్ నుండి షూటింగ్ స్టార్టయ్యే ఛాన్స్ ఉందని టాక్. అలాగే దృశ్యం3 కూడా ఫైనల్ అయ్యింది. ఇలా స్ట్రైట్ మూవీల కన్నా ఫ్రాంచైజీ చిత్రాలనే కంటిన్యూ చేస్తూ అజయ్ దేవగన్ సీక్వెల్ కింగ్‌గా మారిపోయాడు. మరి ఎప్పుడు హిట్ కొడతాడో.