గత కొన్ని సంవత్సరాలుగా కూల్ పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైనర్ చేస్తున్న ఈ తరం ఉత్తమ నటులలో ఫహద్ ఫాసిల్ ఒకరు. ఏ విధమైన పాత్రలోనైనా ఒదిగిపోయే ఆయన నటన అద్భుతం. ఈ మలయాళ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాక్షన్-థ్రిల్లర్ “పుష్ప” ద్వారా తెలుగు అరంగేట్రం చేస్తున్నాడు. ఆయనను ఇందులో విలన్ గా చూడటానికి అభిమానులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫహద్ తనకు రామ్ చరణ్ “రంగస్థలం” బాగా నచ్చిందని, సుకుమార్ “పుష్ప” కథను వివరించినప్పుడు తన పాత్ర అద్భుతంగా ఉంటుందని అన్పించిందని వెల్లడించారు. అంతేకాదు ఈ యంగ్ హీరో ఇలాంటి పాత్రలో ఇంతకుముందెన్నడూ నటించలేదని అంటున్నాడు. ఇంతకుముందెన్నడూ మూవీ లవర్స్ తనను ఇలాంటి పాత్రలో చూడలేదంటూ సినిమాపై భారీ హైప్ ను పెంచేస్తున్నాడు.
Read Also : మహేష్ బాబు, విజయ్ దేవరకొండలకు మాత్రమే ఆ స్థానం !
నటన నైపుణ్యాలకు, కథాంశానికి చాలా ప్రాముఖ్యతనిచ్చే మాలీవుడ్‌లో కొన్ని చాలెంజింగ్ రోల్స్ చేసినప్పటికీ, రంగస్థలం, పుష్ప వంటి సినిమాల్లో తాను నటించలేదని ఫహాద్ చెప్పారు. లాక్డౌన్ కారణంగా “పుష్ప” షూట్‌లో ఫహద్ ఇంకా చేరలేదు. “పుష్ప” చిత్రాన్ని పూర్తి చేశాక కమల్ హాసన్ “విక్రమ్” షూటింగ్ లో చేరతానని ఫహద్ వెల్లడించాడు. కాగా “పుష్ప” ఎర్ర గంధపు చెక్కల అక్రమ రవాణాకు సంబంధించిన కథతో తెరకెక్కుతోంది. ఈ నెల ప్రారంభంలోనే ఈ బృందం హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభించింది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది.