పిక్ : ఎన్డిఏ ట్రైనింగ్ లో “మేజర్” గా అడవి శేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అడివి శేష్ నటించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ “మేజర్” చివరి షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. మేకర్స్ శేష్ తో సాయి మంజ్రేకర్ పై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డిఎ)లో ఉన్న రోజుల్లో శేష్ “మేజర్” సందీప్ ఉన్నికృష్ణన్‌గా ఉన్న పిక్ ను పోస్ట్ చేశారు. ఎన్‌డిఎ యూనిఫాంలో క్లీన్-షేవ్ లుక్ తో శేష్ కనిపిస్తున్నాడు. 2008 ముంబై దాడుల్లో అమరవీరుడి లుక్ లో శేష్ అద్భుతంగా ఉన్నాడు. ఇంతకుముందు పోస్టర్లలో శేష్ ను ఎన్‌ఎస్‌జి ఆఫీసర్ గా చూపించారు. ఎన్‌ఎస్‌జి ఆఫీసర్‌గానే కాకుండా శేష్ తన ఎన్‌డిఎ రోజుల్లో సందీప్ లుక్‌లో సరిగ్గా సరిపోయాడు. సందీప్ ఉన్నికృష్ణన్ 1995లో ఎన్డీఏలో చేరారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కు నివాళులర్పిస్తూ,మేకర్స్ అతని బాల్యం, టీనేజ్, సైన్యంలో చేరడంతో సహా ఆయన జీవితంలోని విభిన్న దశల గురించి ప్రేక్షకులకు వెండితెరపై తెలియజేయనున్నారు. కొంతకాలం క్రితం విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. “మేజర్”షూటింగ్ ఈ నెలాఖరుతో పూర్తవుతుంది.
Read Also : “డాక్కో దాక్కో మేక” సాంగ్ ప్రోమో… అల్లు అర్జున్ స్టైల్ అదుర్స్
Also Read
‘మేజర్’లో అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని తొలుత జూలై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే ప్రస్తుతం కరోనా పేండమిక్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ ప్యాన్ ఇండియా చిత్రాన్ని మలయాళంలోనూ విడుదల చేయబోతున్నారు. ఇందులో శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ మంచి రేటు పలకడంతో చర్చనీయాంశంగా మారింది. “మేజర్” హిందీ వెర్షన్ శాటిలైట్ రైట్స్ 10 కోట్లకు అమ్ముడయ్యాయి. మేకర్స్ త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
- Tags
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?