Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. ‘వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lenin Success Meet: ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న ‘లెనిన్’ సినిమా సక్సెస్‌మీట్‌ను గుంటూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “గుంటూరులో మొదటి రోజు నుంచే ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంది. ప్రతి షోకు వచ్చిన స్పందన చూసి చాలా ఆనందంగా అనిపించింది. ‘భారతి’ పాత్రను ప్రేక్షకులు తమ సొంత వ్యక్తిలా ఆదరించారు. ఇది నాకు లభించిన అతిపెద్ద అవార్డు. మీ ప్రేమ, విజిల్స్, చప్పట్లకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని భాగ్యశ్రీ పేర్కొన్నారు.
ఈ సినిమా డైరెక్టర్ మురళీకిషోర్పై ఆమె ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. “మీరు నాకు కేవలం ఒక పాత్ర ఇవ్వలేదు.. ప్రేక్షకుల హృదయాల్లో స్థానం కల్పించారు. హీరోయిన్ పాత్రలను మరింత బలంగా రాయాలని దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు” అంటూ దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. హీరో లెనిన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. “అఖిల్ నువ్వు అద్భుతమైన హీరోవి. భవిష్యత్తులో నీ నుంచి మరెన్నో గొప్ప సినిమాలు రావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. అలాగే నిర్మాతలు నాగార్జున, నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్, చిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చివరగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. “మీరు చూపించిన ప్రేమకు ప్రతిఫలంగా ఇంకా మంచి పాత్రలు చేయడానికి మరింత కష్టపడతాను. మీ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే పాత్రలతో మళ్లీ మీ ముందుకు వస్తాను” అని భాగ్యశ్రీ భావోద్వేగంగా అన్నారు.
Also Read
- Don't Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
తాజావార్తలు
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!