సినీ నటి కస్తూరి తెలుగు వారిపై ‘ రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారని, అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చేసిన సంగతి తెలిసిందే. కస్తూరి వ్యాఖ్యలపై చెన్నైలోని తెలుగు సంఘాలు మండిపడ్డాయి. దీంతో కస్తూరి వివరణ ఇస్తూ ” తెలుగుప్రజల గురించి నేను తప్పుగా మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్నారు. డీఎంకే వాళ్లు కావాలని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాపై నెగిటివిటీ తీసుకొచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు నాపై ఎంతో అభిమానం చూపుతున్నారు. నన్ను వారు ఎంతగానో ఆదరించారు. ఆ ప్రేమను దూరం చేసేందుకు డీఎంకే వాళ్లు నాపై కుట్ర చేస్తున్నారు” అని అన్నారు.
అలాగే తెలుగు నా మెట్టినిల్లు, తెలుగు వారంతా నా కుటుంబం అంటూ వివరణ ఇచ్చిన కస్తూరిశంకర్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. తమిళనాడులో అధికార డీఎంకే నేతల టార్చర్ భరించలేకపోతున్నానని, తనకు హైదరాబాద్ అభయం ఇచ్చిందన్నారు. ఇప్పటివరకూ తమిళ రాజకీయాలపై మాట్లాడాను, కానీ ఇప్పుడు చెబుతున్నా ఇక నుండి తెలుగు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాను, ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను చేసిన వ్యాఖ్యలపై ఇక్కడి వారు కనీసం వివరణ కూడా అడగకుండా తిట్టారు, కానీ తెలుగు ప్రజలు మాత్రం మీరు ఇలా అన్నారంటే నమ్మలేకున్నాం అని వివరణ కోరారు, దటీజ్ తెలుగు ప్రజలు, త్వరలో తెలంగాణా పాలిటిక్స్ వస్తాను, పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు రాయబారిగా పని చేస్తాను ” అని అన్నారు.