Actor Says I Love You to Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె తెలుగు అమ్మాయి కాకపోయినా ఆమె అంత బాగా మరే ఇతర తెలుగు యాంకర్ షోస్ చేయలేదు అన్నట్టుగా ఆమె తనదైన మార్క్ సృష్టించుకుంది. అయితే ఒక ఆసక్తికరమైన పరిణామం ఆమెకు ఈరోజు కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చోటుచేసుకుంది. మెగా డాటర్ నిహారిక పింక్ ఎలిఫెంట్ బ్యానర్ నిర్మాణంలో ఈ కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా తెరకెక్కింది. ఆగస్టు 9వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ దసరా హోటల్ లో జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో సుమకు ఒక నటుడు ఐ లవ్ యు చెప్పాడు. కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాలో బ్రిటిష్ అనే పాత్రలో నటించాడు శివ అనే వ్యక్తి.
Kalinga : తన చెవిని తానే కోసుకుని తినేస్తున్న అమ్మాయి.. వామ్మో ఇదేం టీజర్ అయ్యా?
అతనిని స్టేజ్ మీదకు పిలిచి మాట్లాడించిన తర్వాత సుమ మైక్ తీసుకుంటున్న సందర్భంగా ఆయన మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను అంటూ సుమకు ఐ లవ్ యు చెప్పాడు. ఒక నిమిషం షాక్ అయిన సుమా వెంటనే చేరుకొని ఐ లవ్ యు బ్రదర్ అంటూ కవర్ చేసింది. నిన్న ఒక బ్రిటిష్ బ్రదర్ తంగలాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దొరికాడు. ఈరోజు ఇంకో బ్రిటిష్ అనే పాత్ర పేరుతో మరో బ్రదర్ దొరికాడు అంటూ ఆమె కామెంట్ చేసింది. నిన్న విక్రం తంగలాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా డేవిడ్ అనే బ్రిటిష్ యాక్టర్ కూడా సుమ చేతిని ముద్దాడాడు. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన చేతిని ముద్దాడిన వెంటనే త్వరలోనే రాఖీ వచ్చేస్తోంది రాజా నువ్వు కంగారు పడకు అన్నట్టుగా తన భర్త రాజీవ్ కనకాలను ఉద్దేశించి అదే సుమ ఈవెంట్లో కామెంట్స్ చేసింది.