ప్రముఖ నటుడిని లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రచీన్ చౌహాన్ అనే బుల్లితెర నటుడు మైనర్ బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో ముంబై పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. “కసౌతి జిందగీ”తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఇచ్చిన ఈ నటుడిని మలాద్ లో అరెస్టు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 354, 342, 323, 506 (2) సెక్షన్లపై కేసును ఫైల్ చేశారు. ఈ కేసు గురించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కుతుంబ్, లవ్ మ్యారేజ్, కుచ్ ఝుకి పాల్కైన్, క్యున్ హోతా హై ప్యార్, క్యా హడ్సా క్యా హకీకాట్, సిందూర్ తేరే నా కా, సాత్ ఫేరే : సలోనీ కా సఫర్, హవన్, చోట్టి బాహు, యే హై ఆషికి వంటి టెలివిజన్ షోలతో పాపులర్ అయ్యాడు. ఈ 42 ఏళ్ల ఈ నటుడు ఇటీవల “ప్యార్ కా పంచ్” అనే వెబ్ సిరీస్‌లో కనిపించాడు.
Read Also : విడాకుల ప్రకటనతో షాకిచ్చిన స్టార్ కపుల్…!?
కాగా అంతముందు కూడా ఇలాగే టీవీ నటుడు పెర్ల్ వి పూరి తన టీవీ షో సెట్స్‌లో మైనర్ బాలికపై అత్యాచారం చేసి వేధించాడనే ఆరోపణతో అరెస్టయ్యాడు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, 2012 ప్రకారం, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 ఎబి (12 ఏళ్లలోపు మహిళపై అత్యాచారానికి శిక్ష) కింద ఈ నటుడిపై కేసు నమోదైంది. అతను దాదాపు 10 రోజులు పోలీసు కస్టడీలో ఉన్నాడు. తరువాత వాసాయి కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. పెర్ల్ అరెస్టు అయినప్పుడు అతను అలాంటివాడు కాదంటూ చాలా మంది టీవీ సెలబ్రిటీలు ఈ నటుడికి మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.