ప్రేక్షకుల మనసులను దోచుకున్న పాపులర్ వెబ్ సిరీస్‌లలో, ప్రధాన పాత్రలు పోషించిన బాలీవుడ్ నటుడు ఆసిఫ్ ఖాన్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారు. హార్ట్ ఎటాక్ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసిఫ్ ఖాన్ తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆసుపత్రి రూమ్ నుంచే ఒక ఫొటోను షేర్ చేస్తూ ఇలా పేర్కొన్నారు..
Also Read : Chiranjeevi : రవి తేజ తండ్రి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం..
“అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాను. 36 గంటలుగా ఇక్కడే ఉన్నాను. హాస్పిటల్ పైకప్పు చూసుకుంటూ జీవితం ఎంత చిన్నదో గ్రహించాను. దేనినీ తేలికగా తీసుకోకండి. ఒక్క క్షణంలో అన్ని మారిపోతాయి. మీకు మీరు కృతజ్ఞతతో ఉండండి. జీవితంలో ఎవరు ముఖ్యమో వారితో ఆనందంగా ఉండండి. జీవితం ఒక వరం. ప్రస్తుతం కోరుకుంటున్నాను. త్వరలోనే ఆరోగ్యంతో తిరిగి వస్తాను’’ అంటూ తెలిపారు. ఈ భావోద్వేగ భరితమైన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అభిమానులు, సహచరులు ఆయనకు త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. అయితే ఆయనే స్వయంగా కోలుకుంటున్నానని తెలిపిన నేపథ్యంలో, త్వరలోనే ఆయన మళ్లీ సెట్‌పైకి రావడం ఖాయం అన్న నమ్మకం అందరిలో నెలకొంది.
ఆసిఫ్ ఖాన్ 2011లో సల్మాన్ ఖాన్, ఆసిన్ జంటగా వచ్చిన ‘రెడీ’ సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా సినీ ప్రయాణం మొదలుపెట్టారు. అనంతరం 2017 లో టాయిలెట్: ఏక్ ప్రేమ కథ చిత్రంలో విలక్షణ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అమేజాన్ ప్రైమ్ వేదికగా వచ్చిన ‘మీర్జాపూర్’ సిరీస్‌లో ‘బాబర్’ పాత్రతో విపరీతమైన క్రేజ్ సంపాదించగా, తర్వాత ‘పంచాయత్’ సీజన్ 3 లో గణేష్ పాత్రతో మరోసారి తన నటనకు మార్కు తెచ్చుకున్నారు. ఆసిఫ్ ఇటీవల సంజయ్ దత్ నటించిన ‘ది భూట్ని’ అనే కామెడీ హర్రర్ చిత్రంలో ‘నాసిర్’ పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆయన ఇష్క్ చాకలాస్, సెక్షన్ 108, నూరానీ చెహ్రా వంటి విభిన్న చిత్రాల్లో నటిస్తున్నారు.