మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్, క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ, బడా నిర్మాత మహావీర్ జైన్ జమ్మూ, కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ని కలిశారు. కాశ్మీర్ ని మళ్లీ బాలీవుడ్ సినిమాల షూటింగ్ కు ఫేవరెట్ స్పాట్ గా మార్చటానికి అక్కడి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కొత్త సినిమా పాలసీ ప్రకటించనుంది. అందుకు సంబంధించిన చర్చల కోసమే ఆమీర్, రాజు హిరానీ, మహావీర్ జైన్ ఎల్ జీ మనోజ్ సిన్హాని కలిశారు. తమ సూచనలు, సలహాలు అందించారు.
Read Also : ఆర్టిఫిషియల్ లెగ్ తో డాన్సింగ్ స్టార్!
గతంలో బాలీవుడ్ సెలబ్రిటీలు ఇంతియాజ్ అలీ, నితీశ్ తివారీ, ఏక్తా కపూర్ లాంటి వారు కూడా జమ్మూ కాశ్మీర్ ఎల్ జీని కలిశారు. తమ అభిప్రాయలు పంచుకున్నారు. అజయ్ దేవగణ్ ఫిల్మ్స్, సంజయ్ దత్ ప్రొడక్షన్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి బ్యానర్స్ నుంచీ కూడా అధికార ప్రతినిధులు కాశ్మీర్ లో పర్యటించి వచ్చారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత మోదీ సర్కార్ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిపై సీరియస్ గా దృష్టి పెట్టింది. పర్యాటక రంగాన్ని మెరుగు పరిచే క్రమంలో బాలీవుడ్ సినిమా షూటింగ్స్ కు అనుకూలమైన పరిస్థితుల్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో కల్పిస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆ దిశగా కృషి చేస్తున్నారు…