మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్, క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ, బడా నిర్మాత మహావీర్ జైన్ జమ్మూ, కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ని కలిశారు. కాశ్మీర్ ని మళ్లీ బాలీవుడ్ సినిమాల షూటింగ్ కు ఫేవరెట్ స్పాట్ గా మార్చటానికి అక్కడి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కొత్త సినిమా పాలసీ ప్రకటించనుంది. అందుకు సంబంధించిన చర్చల కోసమే ఆమీర్, రాజు హిరానీ, మహావీర్ జైన్ ఎల్ జీ మనోజ్ సిన్హాని కలిశారు.…