మెగాస్టార్ చిరంజీవి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఎన్నో విజయాలు అందుకున్నాడు. కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తెలుగు సినిమా అంటే చిరంజీవి.. చిరంజీవి అంటేనే తెలుగు సినిమా అనేలా బ్రాండ్ క్రియేట్ చేశారు. స్క్రీన్ చిరు పై మెరిస్తే అరాచకం.. ఆయన డైలాగులు చెప్తుంటే ఫ్యాన్స్ లో ఉప్పొంగే ఆనందం.. ఇలా ఒకటేమిటి ఆయన ఏం చేసినా అభిమానులకు పండగే. అప్పట్లో ఏ ఇంట్లో చూడు చిరంజీవి ఫోటో కచ్చితంగా ఉండేది. అలాంటిది చిరంజీవి తన బెడ్ రూమ్‌లో ఓ హీరోయిన్ ఫోటో పెట్టు కున్నాడంటే మీరు నమ్ముతారా..
Also Read: Surya : ‘రెట్రో’ ట్రైలర్ డేట్ వచ్చేసింది..
అవును ఈ మాట మీరు నమ్మి తీరాలి. మరి ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నార.. మహానటి సావిత్రి. ఆ హీరోయిన్ పోటో కరెక్ట్‌గా ఆయన బెడ్‌కు ఎదురుగా ఉంటుందట ఉదయం లేవగానే ముందు ఆమె ముఖాన్ని చిరంజీవి చూస్తారట. ఈ విషయాన్ని స్వయానా సావిత్రి కూతురు వెల్లడించారు. ఓ సారి సావిత్రికి సంబంధించిన ఓ కార్యక్రమానికి ఆహ్వానించడానికి చిరంజీవి ఇంటికి వెళ్లింది సావిత్రి కూతురు విజయ. అప్పుడు ఆయన ఆమెతో మాట్లాడుతూ.. ‘నా రూమ్‌లో సావిత్రమ్మ ఫొటో ఉంటుంది. ఉదయాన్నే ఆమె ముఖాన్నే నేను చూస్తాను’ అని చెప్పారట చిరంజీవి. మీరు నమ్ముతారో లేదో అని పైన ఉన్న తన బెడ్ రూమ్ నుంచి ఆ ఫోటోను తెప్పించి మరి చూపించారట. చిరంజీవి బెడ్ రూమ్ లో సావిత్రి ఫోటో చూసి ఆనందంగా ఫీల్ అయినట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు విజయ. ఇక చిరంజీవి కూడా.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో సావిత్రి ఒకసారి ఆయని పిలిచి మరీ మెచ్చుకుందని పలు వేదికల్లో చెప్పారు. మరిక టాలీవుడ్ హీరోలకు చిరు స్పూర్తి అయితే.. చిరుకు మాత్రం సావిత్రి స్పూర్తి.