చాలామంది ముద్దుగుమ్మలు లవర్స్‌తో విడిపోయాకే కెరీర్ సెటిలయ్యారు. అలా విడిపోయిన కొందరు హీరోయిన్స్ గా దూసుకెళ్తున్నారు. ప్రేమ, పెళ్లి, పిల్లలు అనే కలను బ్రేకప్ చెదరగొడుతుంది. అయినా ముద్దుగుమ్మలకు వచ్చిన నష్టమేమీ లేదు. ప్రియుడితో దూరమైన తర్వాతే నయనతార టాప్ ప్లేస్‌కు చేరింది. శింబుతో మొదలైన ప్రేమాయణం ఎక్కువకాలం నిలవలేదు. ఆ వెంటనే గ్యాప్ తీసుకోకుండా ప్రభుదేవా ప్రేమలో పడింది. పెళ్లిదాకా వెళ్తారనుకునేలోపు మనస్పర్ధలతో విడిపోయారు.
Also Read : Suriya : రెట్రో డే -1.. హయ్యెస్ట్ ఫర్ సూర్య
ప్రభుదేవాకు దూరమైన తర్వాతే నయన టాప్ ప్లేస్‌కు చేరింది. వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. సౌత్‌లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆతర్వాత విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని సరోగతి పద్దతిలో ఇద్దరు పిల్లలకు తల్లి అయింది నయన. ప్రేమ మిగిల్చిన గాయలు నయనతారలో ధైర్యాన్ని నింపడమే కాదు. కెరీర్‌కు బంగారుబాట వేశాయి. నయనతారలానే త్రిష కెరీర్ కూడా బ్రేకప్ తర్వాతే టాప్ ప్లేస్‌కు చేరుకుంది. తమిళనాడుకు చెందిన బిజినెస్‌మేన్ వరుణ్ ప్రేమలో పడిందో లేదో పెళ్లికి రెడీ అయిపోయింది. పనిలో పనిగా ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. అయితే ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలతో పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత త్రిష ప్రేమ పెళ్లి ఊసెత్తకుండా 40 ప్లస్‌లోకి అడుగుపెట్టేసింది త్రిష. వయసుతో పాటు అందం పెంచుకుంటూ. స్టార్స్‌కు మెయిన్ ఆప్షన్ అయిపోయింది త్రిష. ఇలా ఈ ఇద్దరు భామలు లవ్ లో ఫెయిల్ అయినా సరే ఎక్కడ వెనుకడుగు వేయకుండా లేడి సూపర్ స్టార్స్ గా ఎదిగి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు.