ప్రతి ఒక ఇండస్ట్రీలో ఫేమస్ జంట అని ఒకటి ఉంటుంది. ఈ హీరో హీరోయిన్లు కలిసి నటిస్తున్నారు అంటే మూవీ కచ్చితంగా హిట్ అయ్యేది. ఇప్పుడు కొత్త దనం కోసం కొత్త హీరోయిన్ లను తీసుకుంటున్నారు కానీ. అప్పట్లో మాత్రం ఒక జంట హిట్ అయింది అంటే రిపిటేడ్‌గా వారు సినిమాలు తీస్తూనే ఉండేవారు. హీరో హీరోయిన్ అని మాత్రమే కాదు.. దర్శకుడు- హీరో, నిర్మాత- హీరో, హీరో- హీరోయిన్ ఇలా కాంబినేషన్‌లో చాలా రకాలు ఉన్నాయి. కాని హీరో- హీరోయిన్ కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో అధిక ప్రాధాన్యత ఉంటుంది. అలా తెలుగులో బ్యూటి ఫుల్ జోడి అంటే చిరంజీవి రాధ, వెంకటేష్ సౌందర్య, ఇలా వీరి కాంబోలో రిపిటెడ్ గా మూవీస్ వచ్చేవి. అయితే ఒక ఫేమస్ జోడి వరుసగా ఒక నాలుగు సినిమాలు తీస్తే ఓకే.. కానీ ఈ హీరో మాత్రం ఏకంగా ఒక్క హీరోయిన్‌తోనే 130 సినిమాల్లో నటించి చరిత్ర సృష్టించాడు.
also Read: Tamannaah : సాయిపల్లవి పై తమన్నా ఇంట్రస్టింగ్ కామెంట్స్..
ఇంతకి ఎవరా నటుడు అంటే మలయాళ హీరో ప్రేమ్ నజీర్. నటి షీలతో ప్రేమ్ నజీర్ 130 సినిమాల్లో నటించాడు. ఒకే హీరోయిన్‌తో అత్యధిక సినిమాలు చేసిన ఘనత ఆయనకు దక్కింది. ఈ జంట కలిసి నటించిన సినిమాలు మరే ఇతర జంట చేయలేదు. అందుకే ఈ ఘనత వారిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నిలిపింది. 1960-1970ల మలయాళ చిత్ర పరిశ్రమలో వీరిద్దరూ ఒక ఐకానిక్ జోడీగా వెలుగు వెలిగారు. వీరిద్దరు కలిసి నటిస్తున్నారు అంటే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారేది..హిట్ కాంబోలో వీరిది మొదటి స్తానం. 130 చిత్రాలు అంటే మామూలు విషయం కాదు.