టాలీవుడ్ సీనియర్ నటి మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఆమె తన భర్త విదియ సాగర్ ను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉంది. కరోనా కారణంగా విద్యాసాగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విదితమే. అయితేసోషల్ మీడియాలో చాలామంది విద్యా సాగర్ మృతిపై అనుమానాలు రేకెత్తించి పావురాల వలన చనిపోయాడు..? చికిత్స అందక మృతి చెందాడు అంటూ పుకార్లు పుట్టించారు. ఇక ఈ పుకార్లపై మీనా స్నేహితురాలు, నటి ఖుష్బూ మండిపడిన విషయం కూడా విదితమే. విద్యాసాగర్ కోవిడ్ వలనే మృతి చెందారు. అందరూ ఎంతో కేర్ తీసుకున్నా ఆయనను కాపాడుకోలేకపోయాం.. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయొద్దు అంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే మీనా భర్తను కాపాడుకోవడానికి ఎంతో కష్టపడినట్లు కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ చెప్పుకొచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మీనా పడిన తపనను కళ్ళకు కట్టినట్లు వివరించి ఎమోషనల్ అయ్యింది.
“నేను, మీనా చాలామంచి స్నేహితులం.. గత నెల ఏప్రిల్ లో మీనా తల్లి పుట్టినరోజు వేడుకల్లో ఆ కుటుంబాన్ని నేను కలిశాను. అప్పటికి విద్యా సాగర్ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఇక నెల తరువాత మీనా నాకు ఫోన్ చేసి విద్యాసాగర్ ఆరోగ్యం ఏమి బాగోలేదని చెప్పి ఆవేదన చెందింది. వెంటనే నేను హాస్పిటల్ కు వెళ్లి పలకరించాను. విద్య సాగర్ గత కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. అయితే వైద్యులు ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తే ఉపయోగం ఉంటుందని చెప్పారు. వెంటనే మీనా తమిళనాడు ముఖ్యమంత్రి ని, మంత్రులను కలిసి ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు హెల్ప్ చేయమని అడిగింది. కానీ ఎక్కడా అవయవం దొరకలేదు.. చివరి నిమిహాసం వరకు మీనా భర్తను కాపాడుకోవడం కోసం ఎంతో ప్రయత్నించింది. కానీ, దేవుడు ఆమెను ఒంటరిని చేసి భర్తను తీసుకువెళ్లిపోయాడు. ఇంత చిన్న వయస్సులో మీనాకు ఇలాంటి కష్టం రావడం ఎంతో బాధాకరమని” ఆమె కంటనీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.