Sita Ramam: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీతారామం. రష్మిక కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్వప్నా దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఆగస్టు 5 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకొంటుంది. అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాపై తమదైన శైలిలో స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఇంతటి విజయాన్ని అభిమానులు అందించినందుకు వైజయంతీ మూవీస్ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక ఈ భారీ సక్సెస్ లో తాను భాగమయ్యింది ఫరియా అబ్దుల్లా.. అదేనండీ మన చిట్టి. జాతిరత్నాలు చిత్రంతో ఫరియాను ఇండస్ట్రీకి పరిచయం చేసింది వైజయంతీ మూవీసే. ఇక దీంతో సీత సక్సెస్ ను చిట్టి ఎలా సెలబ్రేట్ చేసిందో తెలుపుతూ ఒక్క చిన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు మేకర్స్. ఫరియా వద్దకు మృణాల్ ఠాకూర్ విచ్చేసింది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కలిసి డాన్స్ తో ఫిదా చేశారు. ఇక ఇది కేవలం ప్రోమోనే అని ఫుల్ సెలబ్రేషన్స్ త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. సీతతో కలిసి చిట్టి చేసే హంగామా ఏంటో చూడాలంటే పూర్తి వీడియో రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే..