Sushmita Konidela: విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sushmita Konidela: మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మరో కీలక బాధ్యత దక్కింది. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెలను విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. కృష్ణా నది తీరాన ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై అమ్మవారి దర్శనం కోసం ఏడాది పొడవునా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా దసరా నవరాత్రుల సమయంలో ఆలయానికి భారీగా భక్తుల రద్దీ ఉంటుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక ఆలయ ట్రస్ట్ బోర్డులో సుస్మిత కొణిదెలకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా అవకాశం దక్కడం విశేషం.
సినీ రంగానికి చెందిన కుటుంబం నుంచి వచ్చిన సుస్మితకు ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. చిరంజీవి కుమార్తెగానే కాకుండా పలు ప్రాజెక్టులకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. కాగా ఇటీవల సుస్మిత తల్లి సురేఖ కొణిదెలకు కూడా తెలంగాణలోని యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డులో సభ్యురాలిగా అవకాశం దక్కిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త బోర్డులో సురేఖ కొణిదెల పేరును సభ్యుల జాబితాలో చేర్చింది. ఇప్పుడు సుస్మిత కొణిదెలకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితురాలి బాధ్యతలు అప్పగించనున్నట్లు వస్తున్న వార్తలతో కొణిదెల కుటుంబానికి ఆలయ వ్యవహారాల్లో మరో కీలక అవకాశం దక్కినట్టైంది. అయితే సుస్మితకు అప్పగించిన బాధ్యతలు, ఆమె హోదా, బోర్డులో ఆమె పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Epic: ‘కడలి’ ప్రతి అమ్మాయిలోనూ ఉంటుంది.. ఫ్యామిలీ ఆడియన్స్ ని 'ఎపిక్' మెప్పిస్తుంది : వైష్ణవి చైతన్య
- Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. 'అమ్ములు' ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
- Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
- Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
తాజావార్తలు
-
KL Rahul-IPL 2027: ట్రేడ్ రూమర్స్‌కు చెక్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే కేఎల్ రాహుల్!
-
Sushmita Konidela: విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Layoffs: ఇండియాలో లేఆఫ్ ప్రకంపనలు.. ఆ కంపెనీ ఉద్యోగులకు భారీ షాక్..!
-
Arctic: ఆర్కిటిక్‌లో మంచు కరిగితే రూ.21లక్షల కోట్ల నష్టం?
ట్రెండింగ్
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!