Site icon NTV Telugu

Chiranjeevi : వాళ్లనే నమ్ముకుంటున్న చిరంజీవి.. రూటు మార్చేశాడా..?

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఒకటి సెట్స్ మీద ఉండగానే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం విశంభర, మన శివశంకర వర ప్రసాద్ గారు మూవీలు షూటింగ్ లో ఉన్నాయి. ఆయన బర్త్ డే సందర్భంగా బాబీతో మెగా 158 మూవీని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మూవీ ఉండనుంది. ఒకసారి గమనిస్తే.. భోళా శంకర్ సినిమా డిజాస్టర్ తర్వాత కేవలం యంగ్ డైరెక్టర్లు అందులోనూ హిట్స్ ఉన్న వారికి మాత్రమే ఛాన్సులు ఇస్తున్నాడు చిరు. వాల్తేరు వీరయ్య మూవీని డైరెక్ట్ చేసింది బాబీ.

Read Also : Vijay – Rashmika : రష్మిక విజయ్ ను గట్టెక్కిస్తుందా..?

విశ్వంభరతో వశిష్టకు ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి, మళ్లీ బాబీతో మూవీ, ఆ తర్వాత శ్రీకాంత్ తో మూవీ ఉంది. శ్రీకాంత్ తర్వాత వెంకీ అట్లూరితో మూవీ ఉండనుందనే ప్రచారం జరుగుతోంది. దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇలా అందరూ హిట్స్ ఉన్న యంగ్ డైరెక్టర్లే కావడం విశేషం. చూస్తుంటే చిరంజీవి సీనియర్ డైరెక్టర్లను పూర్తిగా పక్కన పెట్టేశాడు. యంగ్ డైరెక్టర్లలోనూ ఆల్రెడీ హిట్స్ ఉన్న వారికే అవకాశాలు ఇస్తున్నాడు. అంతకు ముందు సినిమాల రిజల్ట్ వల్ల.. చిరంజీవి రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తోంది. కేవలం హిట్ ఫార్ములాలో ఉన్న వారినే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇన్నేళ్లు కష్టపడి బిల్డ్ చేసుకున్న కెరీర్ ను.. ఈ టైమ్ లో పాడు చేసుకోవద్దనే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే సెలెక్టెడ్ డైరెక్టర్లకే ఛాన్సులు ఇస్తున్నాడంట.

Read Also : Jeevitha-Rajashekar : కావాలనే జీవిత, రాజశేఖర్ గొడవపడ్డారు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Exit mobile version