Chiranjeevi: కొత్త హీరో శ్రీకాంత్ రెడ్డి, హీరోయిన్ సంచితా బసు జంటగా వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 2 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ దగ్గరపడడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కు రావడానికి ప్రధాన కారణం ఏడిద నాగేశ్వరరావు గారని వారితో తనకున్న అనుబంధం సినిమాయేతర సంబంధంమని చెప్పుకొచ్చారు. వారి నిర్మాణంలో తాను మూడు సినిమాలు చేశానని, శంకరాభరణం, స్వాతిముత్యం, స్వయంకృషి లాంటి ఎన్నో మంచి సినిమాలు పూర్ణోదయ నుంచి వచ్చాయని అన్నారు. ఆయన ఈ సిని పరిశ్రమలోనే ఎక్కవగా ఉన్నానని, కొంత గ్యాప్ ఇచ్చిన మళ్ళీ ఇక్కడకే వచ్చిచేరానని, ఈ పరిశ్రమలో భాగం అయినందుకు గర్వంగా ఉందని తెలిపారు.
సినిమా పరిశ్రమ గొప్ప పరిశ్రమ అన్న చిరు కొంచెం ట్యాలెంట్ ఉండి కష్టపడితే పైకి తీసుకెళ్తోందని, ఇండస్ట్రీని తేలికగా తీసుకొంటే అంతే తొందరగా వెనక్కి పంపిస్తుందని చెప్పుకొచ్చారు. చిత్ర పరిశ్రమ గురించి ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి. ఓటిటీలో అందరు ఇంట్లో కూర్చొని చూస్తున్నారు అని కానీ సరైన కంటెంట్ ఇవ్వగలిగితే తప్పకుండా ప్రజలు థియేటర్స్ కు వస్తారని చెప్పారు. బింబిసార, సీతా రామం, కార్తికేయ 2 మంచి కంటెంట్ తో వచ్చాయి హిట్ అయ్యాయని, ఇండస్ట్రీ కి వచ్చే వాళ్ళు ప్రేక్షకులకు ఏది అవసరం అనేది చూసి కథల మీద దృష్టి పెట్టాలని తెలిపారు. ఇక డేట్స్ క్లాష్ అవుతున్నాయని కంగారు కంగారుగా గా షూటింగ్స్ చెయ్యొద్దని, డైరెక్టర్ అనే వాడు కథల మీద దృష్టి పెట్టాలని తెలిపారు. ఇక ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకొంటున్నట్లు తెలిపారు.