Ram Charan: నాన్న నాలుగు సినిమాలు చేస్తున్నారు.. నోరుజారిన చరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత అరుదైన గౌరవాన్ని అందుకున్న విషయం తెల్సిందే. శ్రీనగర్ లో జరుగుతున్న జీ20 సమ్మిట్ లో చరణ్ పాల్గొన్నాడు. ఇప్పటివరకు ఏ సినీ సెలబ్రిటీ ఈ సమ్మిట్ లో పాల్గున్నది లేదు. దీంతో ఆ అరుదైన గౌరవాన్ని అందుకున్న తోలి తెలుగు హీరో అంటూ చరణ్ ను అందరు ప్రశంసిస్తున్నారు. ఇక ఈ సమ్మిట్ లో చరణ్ ఎంతో యాక్టివ్ గా కనిపించాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో అదరగొట్టాడు. అంతేకాకుండా స్టేజి మీద ఆర్ఆర్ఆర్ స్టెప్పులు వేసి కనువిందు చేశాడు. ఇక ఇండియా గర్వించదగేలా చరణ్ స్పీచ్ అల్టిమేట్ అని చెప్పాలి. కాగా, ఈ స్పీచ్ లో చరణ్.. తన తండ్రి చిరు గురించి చెప్తూ ఆయన చేస్తున్న సినిమాల గురించి నోరు జారాడు. ఇప్పటివరకు చిరంజీవి భోళా శంకర్ సినిమా ఒక్కటే చేస్తున్నారు. అది ఫినిష్ అయ్యాక కుర్ర డైరెక్టర్లతో చిరు సినిమాలు ఉంటాయని టాక్ నడుస్తుంది కానీ, కన్ఫర్మేషన్ లేదు. కానీ ఇప్పుడు చరణ్ చెప్పిన దాంతో కన్ఫర్మేషన్ వచ్చిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
SarathBabu: శరత్ బాబు మృతి.. ప్రముఖుల సంతాపం
Also Read
- Sneha Ulla-Aishwarya :ఐశ్వర్య రాయ్ పోలికలే స్నేహా ఉల్లాల్‌కు శాపమయ్యాయా?
- VIJAY : తమిళనాడు CMగా విజయ్ ప్రమాణస్వీకారం.. కానీ కొడుకు, కూతురు ఎక్కడ.?
- Vijay-Trisha: విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే ఆ ఫంక్షన్లో నేనే డాన్స్ చేస్తా.. రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్!
- Pooja Hegde : పూజాహెగ్డే 'డబుల్ స్టాండర్డ్స్'.. నెటిజన్స్ ట్రోలింగ్
ఇక ఈ సమ్మిట్ లో చరణ్ మాట్లాడుతూ.. ” మా నాన్నగారు ఏజ్ 68. ఇప్పటికీ ఆయన 5.30 కు లేస్తారు. ఆయన దగ్గరనుంచే ఆ క్రమశిక్షణ నేర్చుకున్నాను. ఆయన ఒక్క సినిమాకు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో నేను చూశాను. ఆయన కష్టపడేతత్వం నాకు అలవడింది. ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాలు చేస్తున్నారు. అత్యధికంగా పారితోషికం అందుకుంటున్న హీరోల్లో ఆయన ఒకరు..ఎప్పటికీ మా నాన్నగారే నాకు స్ఫూర్తి” అని చెప్పుకొచ్చాడు. ఇక నాలుగు సినిమాలు అనగానే మెగా అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. ఆ నాలుగు సీనియాల దర్శకులు ఎవరు అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇప్పటికే చిరు.. కళ్యాణ్ కృష్ణ, వశిష్ఠ కథలను ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా మరో రెండు సినిమాలు ఎవరితో ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Hyderabad Liquor Scam: బ్రాండెడ్ మందు బాబులకు షాక్.. ప్రీమియం లిక్కర్లో చీప్ లిక్కర్..
-
CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
-
PM Modi: తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. దళపతికి ప్రధాని మోడీ స్పెషల్ సందేశం..
-
Tamilanadu CM ViJay: రీల్ హీరో నుంచి రియల్ ముఖ్యమంత్రిగా విజయ్ తొలి స్పీచ్.. నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు..
-
Sneha Ulla-Aishwarya :ఐశ్వర్య రాయ్ పోలికలే స్నేహా ఉల్లాల్‌కు శాపమయ్యాయా?