తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద కుటుంబానికి చెందిన అల్లు అరవింద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత అల్లు రామలింగయ్య గారి భార్య కనకరత్నమ్మ గారు (94) వయసులో శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు మధ్యాహ్నం కోకాపేటలో జరగనున్నారు.ఈ విషాద వార్త తెలుసుకున్న తర్వాత చిరంజీవి, అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు కూడా ఆమె పార్ధివ దేహానికి నివాళులు అర్పించేందుకు అల్లు అరవింద్ ఇంటికి చేరుకుంటున్నారు. భద్రత కోసం అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అల్లు అర్జున్ కూడా చేరుకున్నారు , పవన్ కల్యాన్ సతి మని కూడా హాజరయ్యారు.
Also Read : Khushbu Family : ఏడాదిలోనే షాకింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్.. ఖుష్బూ ఫ్యామిలీ ఫోటో వైరల్!
ఇందులో భాగంగా ఈ విషయం పై చిరంజీవి భావోద్వేగంగా స్పందించారు..”మా అత్తయ్య.. దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ శివైక్యం చెందడం ఎంతో బాధాకరం. మా కుటుంబాలపై ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని తెలిపారు. కనక రత్నమ్మ గారి జీవితం, కుటుంబం కోసం చూపిన సేవ, ప్రేమ, మరియు ధైర్యం ఎల్లప్పుడూ అల్లు కుటుంబం కోసం మార్గదర్శకంగా నిలుస్తుంది.
మా అత్తయ్య గారు.. కీ.శే అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం.
మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.
ఓం శాంతిః 🙏— Chiranjeevi Konidela (@KChiruTweets) August 30, 2025