ప్రస్తుతానికి ‘జీ తెలుగు’ ఛానల్‌లో ‘సూపర్ సింగర్ లిటిల్ ఛాంప్స్’ అంటూ ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సుధీర్ యాంకర్‌గా వ్యవహరిస్తుండగా, జడ్జిలుగా అనంత శ్రీరామ్, అనిల్ రావిపూడి, ఎస్పీ శైలజ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సీజన్‌లో వరుణవి అనే చిన్నారి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. వాస్తవానికి ఆమె దివ్యాంగురాలు, పుట్టుక నుంచే రెండు కళ్ళు కనిపించవు. అయినా తన ముద్దు ముద్దు పాటలతో, మాటలతో ఈ సీజన్ మొత్తానికి ఆమె హైలైట్ అవుతోంది. ఒకరకంగా ఆమె వల్లే ఈ సీజన్ ఇంతగా టీఆర్పీ తెచ్చుకుంటుంది అని చెప్పొచ్చు.
Also Read:Jana Nayagan: ‘జన నాయగన్’కు కోర్టు షాక్.. ‘రాజా సాబ్’ సోలో ఎంట్రీ!
అయితే, ఆమె అడక్క అడక్క ఈ మధ్య అనిల్ రావిపూడిని తనను మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్ళమని, కలిపించమని కోరింది. అక్కడికక్కడే మెగాస్టార్ అపాయింట్‌మెంట్ తీసుకున్న అనిల్ రావిపూడి, తాజాగా ఆ చిన్నారిని మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్లారు. ఇక తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆ చిన్నారితో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆ వీడియో చూసిన ఎవరైనా ఎమోషనల్ కాకుండా ఉండలేరు. ఆ చిన్నారికి ఎలాంటి అవసరమున్నా తాను అండగా ఉంటానంటూ మెగాస్టార్ చిరంజీవి ఆ చిన్నారి కుటుంబ సభ్యులకు అభయం ఇవ్వడం గమనార్హం.