Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiru Leaks: మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘కాకా’. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ సాధించడంతో ఈ కొత్త చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి చిరంజీవి స్వయంగా ఇచ్చిన కొన్ని హింట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనంగా మారాయి. పైకి కనిపించే రూపం వేరు.. అసలు వెనుక దాగి ఉన్న చరిత్ర వేరంటూ మెగాస్టార్ ఇచ్చిన లీక్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి.. ‘కాకా’లో తన పాత్ర పేరు కదిరి కాళిదాస్ అని వెల్లడించారు. ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ప్రచారం అవుతున్న కథనాల ప్రకారం.. ఈ సినిమాలో మెగాబాస్ రెండు భిన్నమైన పార్శ్వాలున్న పాత్రను పోషిస్తున్నారట.
బయటి ప్రపంచానికి ఆయన ‘సత్యం’.. ఒక సాధారణ ఆక్వా ఫ్యాక్టరీలో పనిచేసే సూపర్వైజర్. చూడ్డానికి అమాయకంగా, బాధ్యతగల సాధారణ పౌరుడిగా కనిపించే ఈ సత్యం వెనుక, చీకటి ప్రపంచాన్ని శాసించే ‘కదిరి కాళిదాస్’ అనే అండర్‌వరల్డ్ డాన్ ఉన్నాడనే పాయింట్ కథలో ప్రకంపనలు సృష్టించనుందని తెలుస్తోంది. ఈ డ్యూయల్ షేడ్ ట్రాక్ మాస్ ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టడం ఖాయం అని అంటున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు మాత్రమే కాకుండా, ఈ కథకు అసలైన బలం తండ్రీకూతుళ్ల ఎమోషన్ అని తెలుస్తోంది. మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ ఇందులో మెగా డాటర్ ‘అమ్ములు’ పాత్రలో కనిపించనుంది. మెడిసిన్ చదివే కూతురి కోసం ప్రాణమిచ్చే తండ్రిగా చిరంజీవి నటన, వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులను కంటతడి పెట్టించడం ఖాయం అని అంటున్నారు. అసలు అండర్‌వరల్డ్‌ను శాసించే కదిరి కాళిదాస్, సాధారణ సత్యంగా మారి కూతురి కోసం ఎందుకు బతుకుతున్నాడనే సస్పెన్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందట. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ వ్యయంతో ఈ మెగా ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
- Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
కాకా… కదిరి కాళిదాస్ ❤️🔥❤️🔥❤️🔥#KAAKA – JAN 13th Sankranthi 2027🔥#KAAKAOnJan13 pic.twitter.com/tfaa5Nmadk
— Kaaka (@KaakaMovie) September 20, 2026
తాజావార్తలు
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!