మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తె, మన శంకర్ వర ప్రసాద్ గారు నిర్మాత సుష్మిత మీద ప్రసంశల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ ఈ రోజున ఈ పరిశ్రమలో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ నాకు భుజం కాస్తూ అన్ని రకాలుగా నాకు అన్నదండలు అందిస్తూ వస్తోంది సుష్మిత. ఇంటికి పెద్దదయినందుకు ఆ పెద్దరికాన్ని కాపాడుకుంటూ నాకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంది. థాంక్యూ పాప, రామచరణ్ తో పాటు నాకు మరొక బిడ్డ. అలాగే మా చిన్నపాప కూడా అక్కడినుంచి టీవీ చూస్తుంటేమో. థాంక్యూ నాన్న.
ప్లీజ్ ఇదే రకంగా ఉండండి. ఇదే కష్టాన్ని నమ్ముకోండి, కచ్చితంగా భగవంతుడు మీకు ఆశీసులు అందచేసి ఇలాంటి విజయాలు ఇస్తాడు. మేము ఎంత ఇచ్చామ అన్నది కాదు పాప, మీరు ఎంత సాధించుకున్నారు అనేది నాకు మరింత గర్వం అనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ ఆ తర్వాత ఇక్కడ చాలా దూరం వచ్చారు మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీ తల్లిదండ్రులు అందరూ కూడాను మిమ్మల్ని చూసి ఆనందపడాల మీ యొక్క సుదీర్ఘమైన జీవితాన్ని చూసి వాళ్ళు ముచ్చట పడాలి అండ్ ప్రతివాళ్ళు ఏదనా సాధించే ప్రయత్నం చేయాలి అని మెగాస్టార్ అన్నారు.