Chiranjeevi: నాకు క్యాన్సర్ లేదు.. అవాకులు చవాకులు పేలకండి.. చిరు వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: చిరంజీవి క్యాన్సర్ తో పోరాడుతున్నాడు అని వచ్చిన వార్తలను చిరు ఖండించారు. తాను ఆలా అనలేదని స్పష్టం చేశారు. అసలు తనకు క్యాన్సర్ రాలేదని ఖరాకండీగా చెప్పేశారు. శనివారం హైదరాబాద్ నానక్ రామ్ గూడలో నిర్వహించిన స్టార్ క్యాన్సర్ సెంటర్ ఓపెనింగ్ కు చిరంజీవి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన క్యాన్సర్ పై మాట్లాడుతూ.. తానూ క్యాన్సర్ టెస్ట్ చేయించుకున్నాను అని, అందులో పాపిల్స్ ఉంటే డాక్టర్లు తీసేశారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా క్యాన్సర్ కు భయపడాల్సిన అవసరం లేదని, ముందే గుర్తించి చికిత్స తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయంపై మీడియా రకరకాల కథనాలను అందించింది. చిరంజీవి క్యాన్సర్ బారిన పడినట్లు చెప్పుకొచ్చింది. ఇక అలా చెప్పిన రెండు నిమిషాలకే చిరుకు వరుసగా ఫోన్లు వచ్చి.. అభిమానులు భయబ్రాంతులకు గురి కావడంతో చిరు ట్విట్టర్ ద్వారా స్పందించాడు. యూట్యూబ్, వెబ్ సైట్ జర్నలిస్టులకు లైట్ గా వార్నింగ్ ఇచ్చారు.
“కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non – cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో’ అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని మాత్రమే అన్నాను.
Also Read
- Megastar Chiranjeevi: రెండు రోజుల్లో రెండోసారి.. ఎగ్జిబిటర్లతో చిరంజీవి మీటింగ్! 'పెద్ది' విషయంలో కీలక నిర్ణయం..
- Musical Drama : గొంతు క్యాన్సర్ తో పోరాడే రేడియో జాకీ... నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి మలయాళ ఎమోషనల్ డ్రామా
- GV Prakash: క్రేజీ మల్టీస్టారర్ కోసం అనిల్ రావిపూడి బిగ్ స్కెచ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆ కోలీవుడ్ స్టార్!
- Thriller Movie : చీకటి పడితే భయంతో తలుపులు మూసేసుకునే గ్రామం... ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్
అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక చిరు ట్వీట్ చూసిన అభిమానులు హమ్మయ్య.. చిరుకు ఏమి కాలేదని.. ఊపిరి పీల్చుకుంటున్నారు.
కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 3, 2023
తాజావార్తలు
-
US-Hormuz: హార్ముజ్‌పై అమెరికా-ఇరాన్ గుడ్‌న్యూస్.. తీరనున్న చమురు కష్టాలు!
-
GHMC : ఆస్తి పన్నుపై తెలంగాణ బిగ్ రిలీఫ్.. 100% వడ్డీ మాఫీ.!
-
SRH Vs RR: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తుది జట్లు ఇవే..
-
Maggi masala : వంట గదిలోనే 10 నిమిషాల్లో మ్యాగీ మసాలా రెడీ.. రుచి కూడా అమోఘం.!
-
Modi-CM Vijay: మోడీతో సీఎం విజయ్ భేటీ.. 20 నిమిషాలు కీలక చర్చలు
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!