Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరోలకు దేవిశ్రీ ప్రసాద్ లెక్కలేనన్ని మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్స్‌కు దేవిశ్రీ హిట్స్ ఇచ్చినా.. మెగా హీరోలకు ఇచ్చిన క్యాచీ సాంగ్స్ ఎక్కువ. చిరంజీవి, బాబీ కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ అయింది. అయితే, ఇదే కాంబోలో రూపొందుతున్న నెక్స్ట్ సినిమాలో దేవిశ్రీని కాదని తమన్‌ను ఎందుకు తీసుకున్నారు? చిరంజీవే కాదు, మెగా హీరోలందరికీ దేవిశ్రీ దూరమయ్యాడా?
మెగా ఫ్యామిలీ హీరోలతో ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసినా.. ముందుగా గుర్తొచ్చే పేరు మాత్రం దేవిశ్రీనే. ‘ఆర్య’ నుంచి ‘పుష్ప 2’ వరకు బన్నీ, దేవిశ్రీ కాంబినేషన్లో ఏడు సినిమాలు వస్తే, అన్ని మ్యూజికల్ హిట్స్ే. ‘పుష్ప’, ‘పుష్ప2’ కు దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్స్ పాన్ ఇండియా హిట్ అవ్వడానికి, అల్లు అర్జున్ ఇమేజ్ పెంచడానికి బాగా ఉపయోగపడ్డాయి. ఈ జనరేషన్ కు తగ్గట్టు హుషారెత్తించే సాంగ్స్ ఇవ్వటంలో దేవిశ్రీ ఎక్స్పర్ట్. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు క్యాచీ ట్యూన్స్ ఇవ్వలేకపోయినా.. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’, ‘గబ్బర్ సింగ్’ చిత్రాలను మ్యూజికల్ హిట్స్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్.
Also Read
- Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
- Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
- Kangana Ranaut: మెడలో నల్లపూసలు.. చేతికి గాజులు..కంగనా రనౌత్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా..?
- Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
ఇక దేవిశ్రీ, చిరంజీవి కాంబోలో నాలుగు సినిమాలు వస్తే రెండు సూపర్ హిట్ అయ్యాయి. ముందుగా వచ్చిన ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ కు పాటలు ప్రాణంగా నిలిచాయి. ‘అందరివాడు’, ‘శంకర్ దాదా జిందాబాద్’ ఫ్లాప్ అయినా.. దేవిశ్రీ మాత్రం ఫెయిల్యూర్ కాలేదు. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ కాంబో రిపీట్ అవుతోంది. మరి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీని కాకుండా తమన్ ను ఎందుకు తీసుకున్నారు? వరుస ఆఫర్స్ ఇచ్చిన మెగా హీరోలు దేవిశ్రీని ఎందుకు పట్టించుకోవడం లేదు?
‘పుష్ప2’ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాక్షస’కు సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ‘పెద్ది’కి రెహమాన్ మ్యూజిక్ ఇచ్చాడు. కెరీర్ మొదట్లో దేవిశ్రీని ఎంకరేజ్ చేసిన మెగాస్టార్, ఈసారి దేవిశ్రీని రిపీట్ చేయలేదు. ఎందుకు? దేవిశ్రీ ‘ఎల్లమ్మ’ మూవీతో హీరోగా మారాడు. యాక్టర్ గా నెలకు 15 రోజులు డేట్స్ ఇచ్చినా, మిగతా 15 రోజులు మ్యూజిక్ చేస్తానని దేవిశ్రీనే చెప్పాడు. అయితే ‘పుష్ప 2’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బిజిఎం (BGM) విషయంలో జరిగిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా దేవిశ్రీ పై నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ‘పుష్ప 2’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను శ్యామ్, తమన్ లతో చేయించారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు దేవిశ్రీ ట్యూన్స్ ఇచ్చినా, తమన్ బ్యాక్ గ్రౌండ్ ఇవ్వాల్సి వచ్చింది. ಇవన్నీ చిరంజీవి సినిమా ఆఫర్ ను పోగొట్టాయా అని అనిపిస్తోంది. ‘గాడ్ ఫాదర్’ మూవీకి తమన్ మ్యూజిక్ ఇచ్చాడు; చిరంజీవితో వర్క్ చేయడం తమన్ కు ఇది రెండోసారి. బాబీ లాస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ కు కూడా తమనే మ్యూజిక్ ఇవ్వడంతో, మెగా కాంపౌండ్ లోకి మరోసారి ఎంట్రీ ఇవ్వడం తమన్ కు ఈజీ అయింది.
తాజావార్తలు
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్‌హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
-
POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
-
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్‌మార్టానికి హైకోర్టు ఆదేశం
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!